Asianet News TeluguAsianet News Telugu

Omicron: షాకింగ్.. 59 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈజీగా సరిహద్దులు దాటేస్తుంది. ఇప్పటివరకు 59 దేశాలలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టుగా భారత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Over 59 Countries Record 2936 Omicron Cases Says Health Ministry
Author
New Delhi, First Published Dec 10, 2021, 5:30 PM IST

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈజీగా సరిహద్దులు దాటేస్తుంది. ఇప్పటివరకు 59 దేశాలలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టుగా భారత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 59 దేశాలలో 2, 936 కేసులు నమోదు అయినట్టుగా తెలిపింది. అయితే మరో 78,054 శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతుందని.. వాటి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వివరాలను వెల్లడించారు. 

నవంబర్ 24న కేవలం 2 దేశాలు మాత్రమే ఒమిక్రాన్ కేసులు నమోదు చేశాయని.. ఇప్పుడు 59 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించిందని లవ్ అగర్వాల్ చెప్పారు.  భారత్‌లో ఇప్పటిరవరకు మొత్తం 25 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని లవ్ అగర్వాల్ వెల్లడించారు. అయితే అందరిలోనూ తేలికపాటి లక్షణాలనే గుర్తించినట్టుగా చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్రలో 10 ఒమిక్రాన్ కేసులు నిర్థారణ అయినట్లు తెలిపారు. అలాగే రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయినట్లు వివరించారు. మొత్తం వేరియంట్‌లలో.. 0.04 శాతం కన్నా తక్కువ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 

Also read: భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. ముంబైలో ఒకరికి నిర్థారణ, దేశంలో 26కి చేరిన కేసుల సంఖ్య

ఇప్పటివరకు దేశంలో 131 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్టుగా లవ్ అగర్వాల్ తెలిపారు. అర్హులైన జనాభాలో 53 శాతం కంటే ఎక్కువ మంది 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా చెప్పారు.

ముంబైలో తొలి ఒమిక్రాన్ పేషెంట్ డిశ్చార్జ్..
మహారాష్ట్ర ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిన తొలి వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు. ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఆ వ్యక్తిని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు.  మరోవైపు ముంబైలో ఒమిక్రాన్ సోకిన మరో వ్యక్తి కూడా వేగంగా కోలుకుంటున్నట్టుగా అధికారులు తెలిపారు. 

అయితే వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తేలికపాటివే అయినప్పటికీ.. దానిని ఇప్పుడే పూర్తిగా అంచన వేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్  నుంచి తీవ్ర స్థాయిలో ముప్పు పొంచి ఉందని WHO హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు అత్య‌ధిక రోగనిరోధకవ్యవస్థ ఉంద‌నీ, త‌ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున కేసులు పెరిగే అవకాశముందని తెలిపింది. అదే జ‌రిగితే.. తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. ఒమిక్రాన్ సంక్షోభం నుంచి తప్పించుకోగ‌ల‌మ‌ని  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్  వెల్ల‌డించారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ మారుతోంది, కానీ మన సామూహిక సంకల్పం మారకూడదు అని ఆయన పేర్కొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios