భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. ముంబైలో ఒకరికి నిర్థారణ, దేశంలో 26కి చేరిన కేసుల సంఖ్య

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (omicron) భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా మనదేశంలో మరో కేసు వెలుగుచూసింది. టాంజానియా నుంచి ముంబై వచ్చిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

One more Omicron case found in Dharavi area of Mumbai

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (omicron) భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా మనదేశంలో మరో కేసు వెలుగుచూసింది. టాంజానియా నుంచి ముంబై వచ్చిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతకుముందు గుజరాత్‌లోని (gujarat) జామ్‌నగర్‌లో (jamnagar) రెండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన ఓ ఎన్నారైలో ఒమిక్రాన్‌ వెలుగుచూడగా.. తాజాగా ఆయన భార్య, బావమరిదికి కూడా ఈ కొత్త వేరియంట్‌ సోకినట్టు నిర్ధారణ అయిందని జామ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. తాజాగా వచ్చిన రెండు కేసులతో గుజరాత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3కి చేరగా..భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 26కి పెరిగింది.   

వారం రోజుల క్రితం జింబాబ్వే నుంచి 72 ఏళ్ల ఎన్నారై గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు రాగా ఆయనలో కొత్త వేరియంట్‌ కనిపించింది. ఆ మరుసటి రోజు అతడి భార్యతో పాటు బావమరిదికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ -19 పాజిటివ్‌గా తేలడంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం వారి శాంపిల్స్‌ని గాంధీనగర్‌లోని గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చి సెంటర్‌కు తరలించగా ఇద్దరిలోనూ ఒమిక్రాన్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో జామ్‌నగర్‌లోని గురుగోవింద్‌ సింగ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఒమిక్రాన్‌ వార్డుకు వారిని తరలించారు.

Also Read:Covishield Booster Dose: బూస్ట‌ర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలంటే..?

కాగా.. శుక్ర‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 8,503 కరోనా కేసులు (Corona cases) న‌మోద‌య్యాయి. గురువారంతో పోలిస్తే కొత్త కేసులు  స్వల్పంగా తగ్గాయి.  దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,46,74,744కు చేరింది.  ఇదే స‌మ‌యంలో కొత్త‌గా 7,678 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య మొత్తం  3,41,05,066కు పెరిగింది. యాక్టివ్ కేసులు సైతం ల‌క్ష దిగువ‌కు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 94,943 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్నాయి. వీరు వివిధ ఆస్ప‌త్రులు, ఐసోలేష‌న్లు, హోం క్వారంటైన్ లో ఉండి  చికిత్స పొందుతున్నారు. 

అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 634 మంది ప్రాణాలు కోల్పోయారు.  కొత్త మ‌ర‌ణాల్లో అధికంగా కేర‌ళ‌లో 225 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  వెల్లడించింది.  దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌-19తో చ‌నిపోయిన వారి సంఖ్య 4,74,735కు పెరిగింది. మ‌ర‌ణాల రేటు 1.35 శాతంగా ఉండ‌గా, క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.4 శాతంగా ఉంది. వారంత‌పు క‌రోనా పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, కర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, ఛ‌త్తీస్ గ‌ఢ్ లు టాప్‌-10 లో ఉన్నాయి. 

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ల నేప‌థ్యంలో కోవిడ్-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో అధికారులు వేగం పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 65,19,50,127 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించామ‌ని భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 12,89,983 కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు తెలిపింది. వ్యాక్సినేష‌న్‌లోనూ అర్హులైన స‌గం మందికి పైగా టీకాలు పంపిణీ చేశామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. మొత్తం 131.2 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు. అందులో మొద‌టి డోసు తీసుకున్న‌వారు 81 కోట్ల మంది ఉండ‌గా, పూర్తిగా (రెండు డోసులు) తీసుకున్న వారు 50.2 కోట్ల మంది ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios