దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు సేఫ్ అనుకున్న ప్రాంతాల్లో సైతం వైరస్ వెలుగు చూస్తోంది. ముఖ్యంగా దేశానికి ఆయువు పట్టు లాంటి మహానగరాల్లో కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది.

ఇందులో దేశ ఐటీ రాజధాని బెంగళూరు ఒకటి. నగరంలో రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే నగరంలో వైరస్ సోకిన 3 వేల మంది జాడ తెలియకపోవడం అధికార వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.

Also Read:కరోనా వేగంగా విస్తరిస్తోంది, నిర్లక్ష్యం వద్దు: మన్‌కీ బాత్ లో మోడీ

గత రెండు వారాల సమయంలో బెంగళూరులో 16 వేల నుంచి 27 వేలకు కేసులు చేరాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం రాజధానిలోనే వెలుగుచూస్తున్నాయి. అయితే నగరంలో ఇప్పటి వరకు నిర్థారణ అయిన 3,338 మంది ఎక్కడున్నారో తెలియడం లేదు.

నగరంలో నమోదైన కేసుల సంఖ్యలో ఇది దాదాపు 7 శాతం. వీరి కోసం అధికారులు, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శాంపిళ్ల సేకరణ సమయంలో వీరంతా తప్పుడు ఫోన్ నెంబర్లు, చిరునామాలు ఇవ్వడం వల్లే వీరి ఆచూకి తెలుసుకోవడం కష్టతరంగా మారిందని బెంగళూరు నగరపాలక సంస్థ కమీషనర్ మంజూనాథ్ ప్రసాద్ వెల్లడించారు.

Also Read:యువకుడితో ప్రేమ, మరో వివాహం: కూతురిని చంపేసి తండ్రి డ్రామా

ఈ ఉదంతం కారణంగా ఇక మీదట శాంపిళ్లు సేకరించే సమయంలో ప్రభుత్వం జారీ చేసే ఐడీ కార్డుతో పాటు.. ఫోన్ నెంబర్లు, చిరునామాలు సరిచూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.