పోలీసులపై కాల్పులు జరిపి 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న వికాస్ దూబే అనే గ్యాంగ్ స్టర్ ని పట్టుకోవడానికి 25 బృందాలను ఏర్పాటు చేసినట్టు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. 

రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వికాస్ దూబే గురించి గాలించనున్నట్టు తెలిపారు. దాదాపు 500 మొబైల్ ఫోన్ నంబర్స్ ని ట్రేస్ చేస్తున్నామని. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. వికాస్ దూబే గురించి సమాచారం ఇచ్చినవారికి 50,000 రూపాయల నజరానా ఇస్తామని, అతడి పేరు కూడా బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని అన్నారు. 

ఇకపోతే.... గ్యాంగస్టర్ వికాస్ దూబేను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసుల్లో ఎనిమిది బలయ్యారు. వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ స్థాయి ఉన్నతాధికారితో పాటు ఎనిమిది మరణించారు. గురువారం అర్థరాత్రి జరిగిన సంఘటనలో వారు మృతి చెందారు. గాయపడ్డ ఏడుగురు పోలీసులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. 

వికాస్ దూబే కోసం మూడు పోలీసు స్టేషన్లకు చెందిన బృందాలు చౌబేపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దిక్రు గ్రామానికి వెళ్లాయి. వికాస్ దూబేపై 60 కేసులు ఉన్నాయి. తాజా హత్య కేసులో వికాస్ దూబే ఇంటిపై దాడి చేయడానికి పోలీసులు వెళ్లారు. 

Also Read: రౌడీ షీటర్ వికాస్ దూబే గ్యాంగ్ కాల్పులు: ఎనిమిది మంది పోలీసులు బలి

వికాస్ దూబే నేరచరిత్ర చాలా పెద్దదే. 2001లో జరిగిన బిజెపి నేత, రాష్ట్ర మంత్రి సంతోష్ శుక్లా హత్య ఘటనలో వికాస్ దూబే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి అతను విముక్తి పొందాడు. 

కాన్పూర్ లోని శివాలీ పోలీస్ స్టేషన్ పరిధఇలో తారాచంద్ ఇంటర్ కాలేజీ అసిస్టెంట్ మేనేజర్ సిద్ధేశ్వర్ పాండే హత్య కేసులో కూడా అతని పేరు ఉంది. ఈ హత్య 2000లో జరిగింది. 2004లో జరిగిన కేబుల్ వ్యాపారి దినేష్ దూబే హత్య కేసులో అతను నిందితుడు. 

2018లో అతను తన కజిన్ అనురాగ్ పై దాడి చేశాడు. మతి జైలులోనే అతనిపై దాడికి దూబే హత్యకు పథకరచన చేశాడు. ఈ కేసులో వికాస్ దూబేతో పాటు నలుగురిపై అనురాగ్ భార్య ఫిర్యాదు చేసింది. 

జైలులో ఉండగానే అతను శివరాజ్ పూర్ నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. బాల్యంలోనే తన నేరచరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఓ ముఠాను తయారు చేసుకుని లూటీలు, దాడులు, హత్యలు చేస్తూ వచ్చాడు. 19 ఏళ్ల క్రితం అతను పోలీసు స్టేషన్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించి రాష్ట్ర మంత్రిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.