Asianet News TeluguAsianet News Telugu

వ్యక్తిగత కక్షతో కారుకు నిప్పు.. పార్కింగ్‌లో దగ్దమైన మరో 20 కార్లు (వీడియో)

ఢిల్లీలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏరియాలో 20 కార్లు పార్కింగ్ ఏరియాలో కాలి దగ్దమైపోయాయి. వ్యక్తిగత కక్షలతో ఓ వ్యక్తి కారుకు నిప్పు పెట్టి పోయాడు. ఆ నిప్పు ఇతర కార్లకూ వ్యాపించింది. దీంతో 20 కార్లు కాలిపోయాయి.
 

over 20 cars gutted in fire in multi level parking in delhi
Author
First Published Dec 26, 2022, 9:00 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏరియాలో 20 కార్లు కాలిపోయాయి. ఢిల్లీలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన వ్యక్తిగత కక్షతో ఓ కారుకు నిప్పు అంటించాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ, ఆ నిప్పు అక్కడితో ఆగలేదు. పక్కనే ఉన్న ఇతర వాహనాలనూ మంటలు అలుముకున్నాయి. దీంతో 20 కార్లు మంటలకు దగ్దమైపోయాయి. ఈ ఘటన ఢిల్లీలోని సుభాష్ నగర్ ఏరియాలో చోటుచేసుకుంది.

మంటలను ఆర్పడానికి ఏడు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. మంటలను ఆర్పివేశాయి. ఇందుకు సంబంధించి ఓ కేసు నమోదైంది. 

పార్కింగ్ లాట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, వైట్ హోండా సీఆర్‌వీ కారులో ఓ వ్యక్తి వచ్చినట్టు కనిపించింది. కారు దిగి అక్కడే పార్క్ చేసిన ఎర్టిగా కారు టైర్‌కు నిప్పు పెట్టాడు. అదే కారులో తిరిగి వెళ్లిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

Also Read: కళ్ల ముందే మంటల్లో భార్య.. ఏం చేయలేని నిస్సాహయతో చలపతిరావు.. అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు..

పోలీసులు ఆ కారును ట్రాక్ చేశారు. ఎర్టిగా కారుకు నిప్పు పెట్టిన వ్యక్తిని 23 ఏళ్ల యశ్ అరోరాగు గుర్తించారు. అతడు కూడా సుభాష్ నగర్‌ నివాసి అనే తేలింది. పోలీసులు యశ్ అరోరాను అరెస్టు చేశారు.

విచారణలో నిందితుడు తానే నిప్పు పెట్టినట్టు అంగీకరించాడు. ఎర్టిగా కారు యజమాని ఇషాన్ పై తన వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే ఈ పనికి పాల్పడినట్టు చెప్పాడు. ఇషాన్ కారును కాల్చేయాలని అనుకున్నాడని విచారణలో తేలింది. సుభాషన్ నగర్‌లోని మల్టీ లెవెల్ కార్ పార్క్‌లోని ఆ కారు కు నిప్పు పెట్టాలని అనుకున్నట్టు నిందితుడు తెలిపాడు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు అయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios