Asianet News TeluguAsianet News Telugu

కళ్ల ముందే మంటల్లో భార్య.. ఏం చేయలేని నిస్సాహయతో చలపతిరావు.. అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు..

సీనియర్‌ నటుడు చలపతిరావు తన భార్య చిన్నతనంలోనే చనిపోయింది. ఆమె మరణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది. 

chalapathi rao lost his wife in fire accident here the reason for not marrying second time
Author
First Published Dec 25, 2022, 9:51 AM IST

సీనియర్‌ నటుడు చలపతిరావుది సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఆయన చిన్నతనంలో చాలా నాటకాల్లో నటించారు. అంతేకాదు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి వారిని చూసి వారిలా హీరో కావాలనుకున్నారు. ఆ లక్ష్యంతోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ ప్రయత్నాల్లో చాలా కష్టాలు అనుభవించారు. లక్ష రూపాయలతో ఆయన సినిమా డబ్ చేసిన విడుదల చేయగా అది దారుణంగా పరాజయం చెందిందట. దీంతో ఉన్న డబ్బంతా పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయ్యిందని అంటుంటారు. 

అంతేకాదు బందరులో పీయూసీ చదువుకునే సమయంలోనే ఇందుమనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న చలపతిరావు. ఆ సమయంలోనూ తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. అష్టకష్టాలు పడి కుటుంబాన్ని పోషించాడని, ఆతర్వాతనే సినిమాల్లో రాణించాలని మద్రాసుకి వచ్చారట. అక్కడ ఏ రకంగానూ రాణించలేని పరిస్థితిలో చివరగా ఎన్టీఆర్‌ని కలవాలనుకున్నారట. ఓ రోజు ఆయన్ని ఎట్టకేలకు కలిశారు. తన బాధలు, తన ఆసక్తిని చెప్పగా `కథానాయకుడు` చిత్రంలో పాత్ర చేసే అవకాశం ఇచ్చారని సమాచారం. అదే తన తొలి సినిమా అని తెలిస్తుంది. అలా ఎన్టీఆర్‌ సహాయంతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని తెలిపారు చలపతిరావు. 

ఇదిలా ఉంటే మద్రసులో ఉన్న తొలి రోజుల్లో అద్దె ఇంట్లో ఫ్యామిలీతో ఉండేవారు. అప్పట్లో మంచినీళ్లు రెండు మూడు రోజులకు ఓ సారి వచ్చేవని, ఉదయం రెండుగంటల సమయంలో ఆ నీళ్లు వచ్చేవట. ఆ సమయంలో తనభార్య నీళ్లు పట్టేందుకు వెళ్లగా, కిచెన్‌లో ఆమె మంటల్లో చిక్కుకుందట. ఇంట్లో గ్యాస్‌ లీక్‌ అయిన మంటలు చెలరేగాయా? కారణం ఏంటనేది స్పష్టంగా తెలియనప్పటికీ భార్య మంటల్లో తగలపడిపోతుందని, అది చూసి చలపతిరావు షాక్‌ కి గురయ్యారట. మాటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. భార్య ఇందుమతి వెనకభాగం బాగా కలిపోయిందని, దీంతో ఆమె మృతి చెందిందని ఓ ఇంటర్వ్యూలో చలపతిరావు తెలిపారు. దగ్గరే ఉండి ఏంచేయలేని నిస్సాహయ తనదని, తన కళ్ల ముందే భార్య మరణించిందని, ఆ బాధ భరించలేదని తెలిపారు. 

అయితే అప్పటికే తనకు ఇద్దరు అమ్మాయిలు, రవిబాబు జన్మించారు. ముగ్గురు పిల్లల పోషణ తనే చూసుకోవాల్సి వచ్చింది. రెండో పెళ్లి చేసుకుంటే వారిని సరిగా చూసుకోదనే భావంతో మరో పెళ్లి చేసుకోలేదని తెలిపారు చలపతిరావు. వారిని పెంచి పెద్ద చేసి లైఫ్‌లో సెటిల్‌ అయ్యేలా చేశారు. కుమార్తెలు అమెరికాలో సెటిల్‌ అయ్యారు. రవిబాబు గురించి మనందరికి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios