ఇస్రో పతిష్టాత్మకంగా ఈ ఏడాది చంద్రుడిపై చంద్రయాన్ 2 ని ప్రయోగించింది. అయితే... అది చంద్రుని పైకి వెళ్లి తర్వాత కమ్యూనికేషన్స్ మిస్సయ్యాయి.  చంద్రునిపై కి వెళ్లిన తర్వాత కూలిపోయింది. దీంతో... అందరూ నిరాశకు గురయ్యారు. అయితే.... రెండు రోజుల క్రితం చంద్రయాన్ 2 కి చెందిన విక్రమ్ ల్యాండర్ ని చంద్రునిపై గుర్తించామంటూ... నాసా ఫోటోలు విడుదల చేసింది.

ఈ క్రమంలో ఇస్రో ఛైర్మన్ శివన్ ఈ విషయంపై స్పందించారు. నాసాకన్నా ముందే తాము విక్రమ్ ల్యాండర్ ని గుర్తించామని చెప్పారు. ‘‘ మా సొంత ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ ని గుర్తించింది. ఈ విషయాన్ని మేం ఇప్పటికే ఇస్రో వైబ్ సైట్లో వెల్లడించాం. కావాలంటే మీరు కూడా చూడొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరికనట్లు నాసా మంగళవారం ప్రకటించింది. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో అది విచ్ఛిన్నమైందని తెలిపింది. చెన్నైకి చెందిన మెకానికల్ ఇంజినీర్ షణ్ముగ సుబ్రహ్మణ్యన్ సాయంతో ల్యాడర్ ని గుర్తించినట్లు నాసా పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోలను అధికారికంగా విడుదల చేసింది.

AlsoRead విక్రమ్ ల్యాండర్ జాడను కనుగొన్న నాసా... ఫోటోలు విడుదల...

అయితే... చంద్రయాన్ 2 ప్రయోగం జరిగిన మూడు రోజుల తర్వాత ఇస్రో తమ వెబ్ సైట్ లో ఓ పోస్టు పెట్టింది. ‘ చంద్రయాన్ 2 ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ ని గుర్తించింది. అయితే... దానితో ఇంకా కమ్యూనికేషన్ జరగలేదు. ల్యాంటర్ తో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని పేర్కొంది.  తాజాగా.. నాసా ఫోటోలు పెట్టడంతో... ఇస్రో ఛైర్మన్ శివన్ పైవిధంగా స్పందిచాల్సి వచ్చింది