సిద్ధరామయ్యే మా రాముడు.. అయోధ్యలో బీజేపీ రాముడిని ఎందుకు పూజించాలి - కర్ణాటక మాజీ మంత్రి
సిద్ధరామయ్యే (Karnataka Chief Minister Siddaramaiah) తమకు రాముడు అని మళ్లీ ప్రత్యేకంగా అయోధ్యకు వెళ్లి బీజేపీ రాముడి (BJP Lord Ram)ని పూజించాల్సిన అవసరం ఏముందని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హొళల్కెరె ఆంజనేయ (Holalkere Anjaneya)అన్నారు. అయోధ్యలో బీజేపీ రాముడు ఉన్నారని తెలిపారు.
Holalkere Anjaneya : కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి హొళల్కెరె ఆంజనేయ సీఎం సిద్దరామయ్యను పోల్చారు. తమకే ఓ రాముడు ఉన్నారని, అలాంటప్పుడు అయోధ్యకు వెళ్లి బీజేపీ రాముడిని ఎందుకు పూజించాలని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన చిత్రదుర్గలో మీడియాతో మాట్లాడారు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి సిద్ధరామయ్యను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.
గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
‘‘సిద్ధరామయ్య స్వయంగా రాముడు. అలాంటప్పుడు ఆ రాముడిని (అయోధ్య) గుడికి వెళ్లి ఎందుకు పూజించాలి? ఆయన బీజేపీ రాముడు. పబ్లిసిటీ కోసమే బీజేపీ ఇలా చేస్తోంది. వాళ్లను చేసుకోనివ్వండి’’ అని తెలిపారు. ‘‘మా రాముడు నా హృదయంలోనే ఉన్నాడు. నా పేరు ఆంజనేయులు. ఆయన ఏం చేశారో తెలుసా?’’ అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. సీటు కోసం భీకరంగా కొట్టుకున్న మహిళలు.. గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి
కాగా.. హొళల్కెరె ఆంజనేయ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ స్పందించారు. ఇలాంటి మూర్ఖులు, బంధుప్రీతి గల వ్యక్తులు, హిందూ వ్యతిరేకులు గతంలో కర్ణాటక మంత్రులుగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శించారు. ఆంజనేయప్ప ఆరాధ్యదైవమైన సిద్దరామయ్యకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆయన ఇంట్లో అన్ని విధాలుగా జరుపుకోవాలని సూచించారు. కానీ హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి గురించి మాట్లాడటం మానేయాలని, హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని చురకలు అంటించారు.
కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. రాజాసింగ్ ఆగ్రహం.. వీడియో వైరల్
ఇదిలా ఉండగా.. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు తనకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని సిద్ధరామయ్య డిసెంబర్ 30న మీడియాతో తెలిపారు. ‘‘రామాలయ ప్రారంభోత్సవానికి నాకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదు. ఒక వేళ ఆహ్వానం వస్తే పరిశీలిస్తాను’’ అని సీఎం తెలిపారు. కాగా.. కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.