గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Goldy Brar : గోల్డీ బ్రార్ ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో గోల్డీ బ్రార్ కు సంబంధం ఉందని తెలిపింది.
Gangster Goldy Brar : గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ను కేంద్రం ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో గోల్డీ బ్రార్ కు సంబంధం ఉందని పేర్కొంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతడిని ఉగ్రవాదికి ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసులో పేర్కొంది.
గోల్డీ బ్రార్ సీమాంతర సంస్థల మద్దతుతో అనేక హత్యలకు పాల్పడ్డాడని, రాడికల్ భావజాలాన్ని ప్రకటిస్తున్నాడని, జాతీయవాద అనుకూల నాయకులకు బెదిరింపు కాల్స్ చేయడం, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో హత్యల వాదనలను పోస్ట్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
సరిహద్దు వెంబడి డ్రోన్ల ద్వారా అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం, వాటిని షార్ప్ షూటర్లకు సరఫరా చేయడం ద్వారా గోల్డీ బ్రార్ ప్రమేయం ఉందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పంజాబ్ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు విద్రోహం, ఉగ్రవాద మాడ్యూల్స్ ఏర్పాటు, లక్ష్యంగా హత్యలు, ఇతర దేశవ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఆయన, ఆయన సహచరులు కుట్ర పన్నుతున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా.. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు తామే బాధ్యులమని కెనడాకు చెందిన ఉగ్రవాది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు ప్రకటించాడు. 2022 మేలో పంజాబ్ లోని మాన్సా జిల్లాలో మూస్ వాలాను కాల్చి చంపారు. ఈ హత్యకు బ్రార్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూస్ వాలా హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత 2022 జూన్ లో గోల్డీ బ్రార్ ను అప్పగించేందుకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. 2023 జూన్ లో ‘ఇండియా టుడే టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గోల్డీ బ్రార్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ "కిల్ లిస్ట్" లో సల్మాన్ ఖాన్ ఉన్నారని చెప్పారు. దీంతో పాటు సల్మాన్ కు పలు హత్యా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రతను పెంచారు.