అవినీతిపరులకు వ్యతిరేకంగా మా పోరాటం.. వారిని కాపాడేందుకు ప్రతిపక్షాల ఆరాటం - ప్రధాని మోడీ
తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ చర్యలు చూసి కొందరు వణికిపోతున్నారని తెలిపారు. గత పదేళ్లలో కేవలం అభివృద్ధి ట్రైలర్ మాత్రమే చూశారని, ఇప్పుడు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అవినితీపరలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, కానీ వారిని కాపాడేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని మీరట్ నుంచి ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కాదని, 'విక్షిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్)ను రూపొందించడానికి అని అన్నారు.
200 సీట్లకు కంటే ఎక్కువ గెలిచి చూపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్..
మీరట్ లో జరిగిన మెగా ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ అవినీతికి వ్యతిరేకంగా తాను చర్యలు తీసుకుంటున్నందుకు కొందరు వణికిపోతున్నారని అన్నారు. గత పదేళ్లలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించామని దేశం చూసిందన్నారు. ‘‘ఏ దళారులు పేదల నుంచి డబ్బులు దొంగిలించకుండా చూశాం. నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను, అందుకే అవినీతిపరులు నేడు జైలులో ఉన్నారు రాబోయే ఎన్నికలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్డీయేకు, అవినీతిపరులను కాపాడేందుకు ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్నా ఆరాటానికి అని తెలిపారు.
రైతులను ద్వేషించే ఇండియా కూటమి చౌదరి చరణ్ సింగ్ కు సరైన గౌరవం కూడా ఇవ్వలేదని అన్నారు. ‘‘చర్చ సందర్భంగా పార్లమెంట్ లోపల ఇండియా కూటమి ఏం చేసిందో దేశం మొత్తం చూసింది. మా తమ్ముడు జయంత్ చౌదరి భారతరత్న అవార్డు గురించి పార్లమెంటులో మాట్లాడేందుకు లేచి నిలబడినప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, ఎస్పీలు ఇంటింటికీ వెళ్లి ఈ ప్రాంత రైతులకు క్షమాపణ చెప్పాలి’’అని ప్రధాని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం..
తాను అవినీతిపరులపై విచారణ జరపడమే కాకుండా, ప్రజలు దొంగిలించిన సంపదను వారికి తిరిగి ఇస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు. ‘‘నేను అవినీతిపరులపై మాత్రమే విచారణ జరపడం లేదు. నా దేశ ప్రజలను ఎవరు దోచుకున్నారో, నా ప్రజల దోచుకున్న సంపదను తిరిగి వారికి తిరిగి ఇస్తాననేది నా గ్యారంటీ’’ అని ఆయన పేర్కొన్నారు.
పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కేకే వైదొలగడం దురదృష్టకరం - హరీశ్ రావు
తమ ప్రభుత్వం ఇప్పటికే మూడోసారి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాబోయే ఐదేళ్లకు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని, మొదటి 100 రోజుల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కసరత్తు వేగంగా జరుగుతోందని తెలిపారు. గత పదేళ్లలో కేవలం అభివృద్ధి ట్రైలర్ మాత్రమే చూశారని, ఇప్పుడు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.