200 సీట్లకు కంటే ఎక్కువ గెలిచి చూపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్..
200 సీట్ల కంటే ఎక్కువ గెలిచి చూపాలని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుచుకోవాలన్న బీజేపీ లక్ష్యాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. బీజేపీ 400 పైగా సీట్లు గెలుచుకుంటామని చెబుతోందని, అయితే ముందుగా 200 సీట్లు అయినా దాటాలని సవాల్ విసిరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 200కు పైగా సీట్లు వస్తాయని చెప్పారని, కానీ 77 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు.
పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కేకే వైదొలగడం దురదృష్టకరం - హరీశ్ రావు
టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్ లో జరిగిన న్నికల ర్యాలీలో ఆదివారం ఆమె పాల్గొని మాట్లాడారు. తమ రాష్ట్రంలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని, బెంగాల్ అంటే టీఎంసీ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలును అనుమతించబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘‘సీఏఏ చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చే ఉచ్చు. పశ్చిమ బెంగాల్లో సీఏఏ, ఎన్ఆర్సీలను అనుమతించబోం’’ అని తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలైన సీపీఎం, కాంగ్రెస్ లు బీజేపీతో చేతులు కలిపాయని మమతా బెనర్జీ విమర్శించారు. తమ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తినందుకే ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరించారని ఆమె అన్నారు. అందుకే ఆమెతో పాటు బెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లో టీఎంసీని గెలిపించాలన్నారు.