పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కేకే వైదొలగడం దురదృష్టకరం - హరీశ్ రావు
కే.కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అలాంటి పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేసి వెళ్లడం దురదృష్టకరమని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కే.కేశవరావు కాంగ్రెస్ లో చేరడం దురదృష్టకరమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలోని గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపద సమయంలో పార్టీని వీడే నాయకులను తిరిగి తీసుకోబోమని హెచ్చరించారు.
కేజ్రీవాల్ సింహం.. ఆయనను ఎక్కువ కాలం బంధించలేరు- భార్య సునీతా కేజ్రీవాల్
‘‘బీఆర్ఎస్ పార్టీ కేశవరావును రెండు సార్లు రాజ్యసభకు ఎంపీగా పంపించింది. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఆయన కుమార్తెకు, కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆయన కుమారుడికి ఇచ్చింది. పార్టీ ఎప్పుడూ ఆయనను గౌరవంగా చూసుకునేది. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఆయనకు అన్యాయం చేశారా ? పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన పార్టీని వీడటం దురదృష్టకరం’’ అని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికలు.. రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు..
కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేని హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ 100 రోజుల దుర్మార్గపు పాలనతో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఓపిక పట్టాలని ఆయన కోరారు. త్వరలోనే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం..
ఈ సందర్భంగా మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై హరీశ్ రావు విమర్శలు చేశారు. గజ్వేల్ లో జరుగుతున్న అభివృద్ధిని అంగీకరించలేని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మెదక్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఏప్రిల్ 2న సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటానని హరీశ్ రావు తెలిపారు.