ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫాంలపై విడుదలయ్యే సినిమాలపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు.

అశాంతిని, అవాస్తవాలను కొన్నిసార్లు సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసే సోషల్ మీడియా రాతలకు అడ్డుకట్ట వేస్తామని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

అసత్య, దుష్ప్రచారాలను అడ్డుకునేలా నియంత్రణ తెస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీనిలో భాగంగా మూడు నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఇకపై ఇష్టానుసారం వీడియోలు కుదరదు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సంస్థలు భారత్‌లో ఖచ్చితంగా అధికారులను నియమించాలి. సోషల్ మీడియా సంస్థలు భారత్‌లో కార్యాలయాలు ఏర్పాటుచేయాలి. ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి. చట్టాలు పాటించేలా చర్యలు తీసుకునే అధికారులు భారత్‌లోనే ఉండాలి. ఇక నుంచి ఐదు విభాగాలుగా ఓటీటీ వీడియోలు ఉండాలి. 

1. అన్ని వయస్సుల వారు చూసే యూనివర్సల్ వీడియోలు
2. ఏడేళ్ల లోపు చూసే వీడియోలు
3. 13 ఏళ్ల లోపు చూసే వీడియోలు
4. 16 ఏళ్ల లోపు చూసే వీడియోలు
5.  పెద్ద వారు చూసే వీడియోలు