‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ డాక్యుమెంటరీలో ఉన్న ఏనుగులు ఇప్పుడు స్టార్లు అయిపోయాయి. వాటిని చూసేందుకు ఎంతో మంది తరలివస్తున్నారు. ఈ ఏనుగులు ప్రస్తుతం తమిళనాడులోని ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరంలో ఉన్నాయి.
కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ ను గెలుచుకుంది. ఇది హాల్ అవుట్, హౌ డూ యు పర్స్ ఎ ఇయర్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ వంటి ఇతర నామినీలతో పోటీ పడింది. అయితే ఆస్కార్ గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పర్స్' ఫేమస్ అయిన ఏనుగు పిల్లను చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.
అర్థరాత్రి ప్రేయసిని కలవడానికి వెడితే.. పెళ్లి చేసి పంపించారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ లో రెండు అనాథ ఏనుగులను దత్తత తీసుకున్న ఓ కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 39 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిల్మ్ లో రెండు ఏనుగు పిల్లలైన రఘు, అము, వాటి సంరక్షకులు బొమ్మన్, బెల్లీ మధ్య విడదీయరాని బంధాన్ని చూపెట్టింది.
ఈ తమిళ డాక్యుమెంటరీ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా సోమవారం (భారత కాలమానం ప్రకారం) 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో గోల్డ్ స్టాట్యుయేట్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా కార్తీ ప్రసంగిస్తూ.. ‘మనకూ, మన సహజ ప్రపంచానికీ మధ్య ఉన్న పవిత్ర బంధం గురించి మాట్లాడేందుకు ఈ రోజు ఇక్కడ నిల్చున్నాను. ఆదివాసీల గౌరవం, ఇతర జీవుల పట్ల అస్థిత్వం, సహజీవనం కోసం మా స్థలాన్ని మేము పంచుకుంటాము. స్వదేశీ ప్రజలు, జంతువులను హైలైట్ చేస్తూ మా చిత్రాన్ని గుర్తించిన అకాడమీకి ధన్యవాదాలు... గునీత్ కు, నా టీం మొత్తానికి, చివరగా ఎక్కడో ఉన్న మా అమ్మ నాన్న, సోదరికి, నా మాతృభూమి భారతదేశానికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
అయితే ఈ డాక్యుమెంటరీ నిర్మాతగా ఉన్న గునీత్ మోంగా ఆస్కార్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2019లో మోంగా తీసిన డాక్యుమెంటరీ 'పీరియడ్'. 'డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్' కేటగిరీలో 'ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.
తనని తానే పెళ్లి చేసుకున్న యువతి.... 24గంటల్లో విడాకులు..!
కాగా.. ది ఎలిఫెంట్ విస్పర్స్ ద్వారా అయిన ఏనుగు పిల్లలను చూసేందుకు పర్యాటకులు అధికంగా తరలివస్తున్నారు. అవి ఇప్పుడు ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరంలో సంరక్షణలో ఉన్నాయి. ‘ఇది చాలా గొప్ప క్షణం. ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఏనుగు నాకు ఇష్టమైన జంతువు, ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది’’ అని ఓ టూరిస్ట్ ‘ఎన్డీటీవీ’తో అన్నారు.
