Asianet News TeluguAsianet News Telugu

పండ్ల వ్యాపారికి పద్మశ్రీ పురస్కారం.. పవన్ ప్రశంసలు.. ఆయన చేసిన సేవేంటో తెలుసా?

ఓ పండ్ల వ్యాపారిగా ఉంటూ.. ఆ వచ్చిన డబ్బుతో ఆయన చేసిన గొప్ప పని ఏంటో తెలిస్తే.. ఆయనపై ఎవరైనా ప్రశంసల వర్షం కురిపించాల్సిందే. ఆయన పద్మ శ్రీ మాత్రమే కాదు.. అంతకన్నా... పెద్ద పురస్కారం ఇచ్చినా తప్పులేదని అంటారు.

Orange seller Harekala Hajabba wins Padma Shri
Author
Hyderabad, First Published Nov 15, 2021, 10:31 AM IST

వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించినవారికి మన భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం పద్మశ్రీ. ఇప్పటి వరకు.. మన దేశంలో చాలా మంది ఈ పురస్కారం దక్కింది. అయితే.. ఈ సారి ఓ పండ్లు అమ్ముకునే వ్యాపారికి పద్మ శ్రీ అవార్డు దక్కింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.  ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ .. పద్మ పురస్కారాలను అందించిన సంగతి తెలిసిందే. 

అయితే... ఆ పురస్కారాలు అందుకున్న వారిలో.. ఓ పండ్ల వ్యాపారి ఉండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒక పండ్ల వ్యాపారికి.. పద్మ శ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారా అనే అనుమానాలు కూడా కలిగాయి. అయితే..  ఓ పండ్ల వ్యాపారిగా ఉంటూ.. ఆ వచ్చిన డబ్బుతో ఆయన చేసిన గొప్ప పని ఏంటో తెలిస్తే.. ఆయనపై ఎవరైనా ప్రశంసల వర్షం కురిపించాల్సిందే. ఆయన పద్మ శ్రీ మాత్రమే కాదు.. అంతకన్నా... పెద్ద పురస్కారం ఇచ్చినా తప్పులేదని అంటారు.

Also Read: దేశంలోనే తొలిసారి.. ఆవుల కోసం స్పెషల్ గా అంబులెన్స్..!

కర్ణాటక రాష్ట్రానికి చెందిన హరేకాలా హజబ్బా అనే వ్యక్తి.. పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెద్దగా చదువుకోలేదు. కానీ.. చదువు పట్ల ఆయనకు అపారమైన గౌరవం ఉంది. తాను చదువుకోకపోయినా.. తనలా మరికొందరు అలా చదవు లేకుండా ఉండకూడదని అనుకున్నాడు. అందుకే.. తన జీవితంలో సంపాదించిన సంపాదన మొత్తం తమ గ్రామంలో పాఠశాల నిర్మించడానికి ఇవ్వడం గమనార్హం.

 

మంగళూరు హరేకాలా-న్యూపడ్పు గ్రామంలో ఓ పాఠశాలను నిర్మించారు. ఇదంతా ఆయన జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుతో చేయడం విశేషం.  మంగళూరులోని హమ్‌పన్‌కట్టా మార్కెట్‌లో 1977 నుంచి ఆయన పండ్లు అమ్ముతున్నారు. రోజుకు రూ.150 సంపాదిస్తారు. అందులోనే రోజూ కొంత డబ్బు దాచి ఏకంగా పాఠశాలనే నిర్మించారు.

Orange seller Harekala Hajabba wins Padma Shri

ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. సమాజసేవా రంగంలో ఆయన పద్మ పురస్కారం దక్కింది. ఆయనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. ఆయన గురించి ఓ ట్వీట్ చేశారు. కాగా.. తాజాగా.. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం.. ఈ పండ్ల వ్యాపారి గురించి ట్వీట్ చేయడం గమనార్హం.

దీంతో..  ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందరూ.. ఆ పండ్ల వ్యాపారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios