Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే తొలిసారి.. ఆవుల కోసం స్పెషల్ గా అంబులెన్స్..!

. దేశంలో తొలిసారి గా.. గోమాత ఆవుల కోసం అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

Uttar Pradesh To Start "First In The Country" Ambulance Service For Cows
Author
Hyderabad, First Published Nov 15, 2021, 9:39 AM IST

ఇప్పటి వరకు మనుషులకు అంబులెన్స్ సేవలు ఉన్నాయని మనకు తెలుసు. ఇక మనం పెంచుకునే కుక్కలు, పిల్లల కోసం కూడా స్పెషల్ గా పెట్ అంబులెన్స్ లు ఉన్నాయి. అయితే.. దేశంలో తొలిసారి గా.. గోమాత ఆవుల కోసం అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

Also Read: నిషేధిత పవిత్ర స్థలంలో షూటింగ్.. యూట్యూబర్ అరెస్ట్...

దేశంలోనే మొట్టమొదటిసారి యూపీలో ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసును ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆవుల కోసం అంబులెన్స్ సేవను ప్రారంభించనున్నట్లు యూపీ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి తెలిపారు.‘‘112 ఎమర్జెన్సీ సర్వీస్ నంబరుతో సమానంగా ఈ కొత్త అంబులెన్స్ సేవలు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ఆవులకు చికిత్స చేయడానికి మార్గం సుగమం చేస్తుంది’’ అని చౌదరి మధురలో విలేకరులతో చెప్పారు. ఈ పథకం కింద 515 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, దేశంలోనే ఆవుల చికిత్స కోసం అంబులెన్స్ లను ప్రవేశపెట్టడం మొదటిసారి అని మంత్రి పేర్కొన్నారు. 

Also Read: అస్సాం రైఫిల్స్‌పై ఉగ్రదాడి.. భారత్- మయన్మార్‌ల సరిహద్దులను మూసేస్తాం: మణిపూర్ సీఎం

అనారోగ్యం బారిన పడిన ఆవుల చికిత్స కోసం ఫోన్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లోనే వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్ వస్తుందని మంత్రి తెలిపారు.డిసెంబరు నాటికి ఈ పథకం కింద ఫిర్యాదుల స్వీకరణ కోసం లక్నోలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.ఉచితంగా నాణ్యమైన వీర్యం అందిండంతో యూపీ రాష్ట్రంలో ఆవుల జాతి అభివృద్ధి కార్యక్రమం మరింత ఊపందుకుంటుందని చౌదరి చెప్పారు. మథుర సహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ ఆవుల అంబులెన్స్ ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి చౌదరి వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios