Himanta Biswa Sarma: సర్జికల్ స్ట్రైక్స్ అంశం దేశంలో ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. సర్జికల్ స్ట్రైక్ ను మళ్లీ ప్రశ్నించడం ద్వారా మన అమరవీరులను అవమానించడానికి ప్రతిపక్షాలు పూనుకున్నాయని ఆరోపించారు.
Himanta Biswa Sarma: సర్జికల్ స్ట్రైక్స్ అంశం దేశంలో ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) స్పందిస్తూ.. సర్జికల్ స్ట్రైక్ ను మళ్లీ ప్రశ్నించడం ద్వారా మన అమరవీరులను అవమానించడానికి ప్రతిపక్షాలు పూనుకున్నాయని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అసోం సీఎం.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబం పట్ల తమ విధేయతను నిరూపించుకోవడానికి కేసీఆర్, ఆయన బృందం పోటీ పడుతున్నారని అన్నారు. పుల్వామా వార్షికోత్సవం సందర్భంగా మరోసారి ప్రతిపక్షాలు అమరవీరులను అవమానిస్తున్నాయని విమర్శించారు.
ట్విట్టర్ వేదికగా స్పందంచిన అసోం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma).. "పుల్వామా ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా-సర్జికల్ స్ట్రైక్‌ను మళ్లీ ప్రశ్నించడం ద్వారా మన అమరవీరులను అవమానించేలా ప్రతిపక్షాలు ముందుకు సాగుతున్నాయి. కేసీఆర్ & కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి తమ విధేయతను నిరూపించుకోవడానికి పోటీ పడుతున్నాయి. మా విధేయత భారత్‌పై ఉంది. సాయుధ బలగాలను ప్రశ్నించే వారిని వదిలిపెట్టరు" అంటూ ఆంటూ ట్వీట్ చేశారు.
కాగా, ఇదివరకే పలు మార్లు కాంగ్రెస్ నేత, కేరళ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi).. సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలనీ, ఆధారాలను బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. సర్జికల్ స్ట్రైక్ ను భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, “జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలోనే భారత్ పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. రాహుల్ గాంధీ దినికి రుజువు అడుగుతున్నారు. మీరు రాజీవ్‌గాంధీ కుమారుడా కాదా అని మేం ఎప్పుడైనా మిమ్మల్ని ప్రూఫ్ అడిగామా? నా సైన్యం నుండి రుజువు కోరడానికి మీకు ఏ హక్కు ఉంది? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజకీయ వర్గాలు సైతం ఆయన అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) స్పందిస్తూ.. బీజేపీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలకు ప్రధాని సంతోషిస్తున్నారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. “మేము ఈ విషయాన్ని వదిలిపెట్టము. మేం ఇదంతా కాంగ్రెస్‌తో పొత్తు కోసం మాట్లాడటం లేదు. వారికి అవమానం ఉంటే క్షమాపణ చెప్పాలి' అని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆధారాలు అడగడంలో తప్పు లేదని, తాను కూడా అదే అడుగుతానని కేసీఆర్ అన్నారు. “సర్జికల్ స్ట్రైక్స్ (surgical strikes)ని రాజకీయ మైలేజీ కోసం బీజేపీ వాడుకుంటోందని అందరూ అనుకుంటున్నారు. అవే సందేహాలు మనందరికీ ఉన్నాయి. ఆధారాలు అడగడంలో తప్పేమీ లేదు” అని కేసీఆర్ అన్నారు.
