Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ పోరు: ఏకమైన ప్రతిపక్షాలు.. 12 మంది నేతల ఘాటు లేఖ, డిఫెన్స్‌లో మోడీ

దేశంలో కోవిడ్ నేపథ్యంలో .. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలుపై సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. 

opposition parties send joint letter to pm narendra modi for covid ksp
Author
new delhi, First Published May 12, 2021, 9:34 PM IST

దేశంలో కోవిడ్ నేపథ్యంలో .. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలుపై సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం), ఫరూక్‌ అబ్దుల్లా (జేకేపీఏ), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), డి.రాజా (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం) తదితరులు ప్రధానికి లేఖ రాసిన వారిలో ఉన్నారు. బడ్జెట్‌లో వ్యాక్సినేషన్‌కు కేటాయించిన రూ. 35 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని వీరు ప్రధానిని కోరారు. అలాగే సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని విజ్ఞప్తి చేశారు.   

లేఖలో ముఖ్యాంశాలు:

  • దేశీయంగా, అంతర్జాతీయంగా వీలున్న చోటు నుంచి వ్యాక్సిన్‌ సేకరించాలి.  
  • ఉచితంగా యూనివర్సల్‌ మాస్‌ వ్యాక్సిన్‌ క్యాంపెయిన్‌ చేపట్టాలి.  
  • దేశీయంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచాలి.  
  • వ్యాక్సిన్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35కోట్లు వెంటనే విడుదల చేయాలి.  
  • ఢిల్లీలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలి.  
  • లెక్కలోకి రాని ప్రైవేటు ట్రస్ట్‌ ఫండ్‌ను పీఎం కేర్‌ ద్వారా వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌, ఇతర ఔషధాల కొనుగోలుకు వినియోగించాలి.  
  • నిరుద్యోగులకు నెలకు రూ.6 వేలు భృతి చెల్లించాలి.  
  • పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించాలి.  
  • కొవిడ్‌ పరిస్థితుల్లో రైతులను ఏమాత్రం ఆదుకోలేకపోయిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. 
Follow Us:
Download App:
  • android
  • ios