Asianet News TeluguAsianet News Telugu

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌పై అవిశ్వాసం: 12 పార్టీల నోటీసు

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ హరివంశ్ సింగ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి.డిప్యూటీ ఛైర్మెన్ పై 12 పార్టీలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. 

Opposition members sit in protest inside RS after House adjourned
Author
New Delhi, First Published Sep 20, 2020, 4:10 PM IST

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ హరివంశ్ సింగ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి.డిప్యూటీ ఛైర్మెన్ పై 12 పార్టీలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. 

రాజ్యసభలో ఆదివారం నాడు వ్యవసాయ బిల్లులు వాయిస్ ఓటుతో ఆమోదం పొందాయి. ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.వైసీపీ, బీజేడీ పార్టీలు సమర్ధించాయి.ఇతర పక్షాలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. 

also read:రాజ్యసభలో విపక్షాల నిరసనలు: వ్యవసాయ బిల్లులకు ఆమోదం

విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే వాయిస్ ఓటుతో ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదం పొందింది.రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. సభ వాయిదా పడిన తర్వాత కూడ విపక్షపార్టీలకు చెందిన ఎంపీలు సభలోనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ వ్యవహారం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అహ్మాద్ పటేల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన డిప్యూటీ ఛైర్మెన్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించాడు.

రాజ్యసభలో ఇవాళ చోటు చేసుకొన్న ఘటనలను తాను తన జీవితంలో ఏనాడూ చూడలేదని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.  అనాగరికమైన, హింసాత్మకమైన ప్రవర్తనను తాను చూడలేదన్నారు.

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వ్యవసాయ బిల్లులతో రైతులకు అన్యాయం జరుగుతోందని  కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులను అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios