‘అందరూ ఉన్నారు.. చంద్రబాబు ఒక్కరే వెళ్లారు’

Opposition coming together no threat to BJP
Highlights

మీడియాతో అమిత్ షా

తమ ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వెళ్లిపోయారని.. మిగిలిన వారంతా తమతోనే కొనసాగుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం చేసిన సంస్కరణల గురించి అమిత్ షా వివరించారు. 

అయితే ప్రధాని మోదీ తీసుకుంటున్న పలు నిర్ణయాల వల్ల ఎన్డీయే కూటమి నుంచి భాగస్వాములు బయటకు వెళ్లిపోతుండడంపై అమిత్ షాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అమిత్ షా జవాబిస్తూ.. ‘‘తెలుగు దేశం పార్టీ వెళ్లిపోయింది. కానీ నితీశ్ వచ్చారు. 2014 తర్వాత 11 పార్టీలు మా కూటమిలో భాగస్వామ్యమయ్యాయి. ఎన్డీయే కూటమి పెరుగుతోంది కానీ, తగ్గడం లేదు. చంద్రబాబు ఒక్కరే కూటమి నుంచి బయటకు వెళ్లారు’’ అని చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్షాలు అన్నీ ఏకమైనా.. తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 

loader