Asianet News TeluguAsianet News Telugu

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ప్రమాదానికి గురైంది: రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ

కోరమండల్  ఎక్స్ ప్రెస్  ఒక్కటే  ప్రమాదానికి గురైందని  రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా  చెప్పారు. 

Only Coromandal Express met with an accident, says Railway Board member lns
Author
First Published Jun 4, 2023, 1:45 PM IST


న్యూఢిల్లీ:  ఒడిశాలోని  బాలాసోర్  వద్ద   కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు  ఒక్కటే ప్రమాదానికి గురైందని  రైల్వే బోర్డు మెంబర్  జయవర్మ సిన్హా  చెప్పారు.
 ఆదివారంనాడు ఆమె  న్యూఢిల్లీలో  మీడియాతో మాట్లాడారు.  

కోరమండల్  ఎక్స్ ప్రెస్ రైలు  లూప్ లైన్ లోకి వెళ్లిందని  రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా  చెప్పారు. బహనాగస్టేషన్ వద్ద  ప్రమాదం  జరిగిందని జయవర్మసిన్హా  చెప్పారు. బహనాగస్టేషన్ వద్ద   రెండు లూప్  లైన్స్, రెండు మెయిన్ లైన్స్  ఉన్నాయన్నారు.  కోరమండల్  ఎక్స్ ప్రెస్  రైలు లూప్ లైన్ లోకి వెళ్లిందని  ఆమె తెలిపారు.  

ఒక ట్రాక్ నుండి మరో ట్రాక్ కు  జాయింట్  చేయడమే పాయింట్  అని ఆమె వివరించారు.  కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు  గ్రీన్ సిగ్నల్  ఇచ్చినా  పాయింట్  ఎందుకు  మారలేదో వర్యాప్తు  చేయనున్నామన్నారు.   ఇది నాలుగు లైన్ల  స్టేషన్ గా ఆమె  చెప్పారు.   ఇందులో  రెండు మెయిల్ లైన్లు కాగా , మరో రెండు  లూప్ లైన్లుగా  జయవర్మ వివరించారు. బహనాగ  రైల్వే స్టేషన్  లో  ఈ ప్రమాదం   06:45 గంటలకు  జరిగిందని  జయవర్మ  చెప్పారు.

also read:బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 5 లక్షలు: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

 సిగ్నలింగ్  సమస్య వల్లే  ఈ ప్రమాదం  జరిగినట్టుగా  ప్రాథమిక విచారణలో తేలిందని  జయవర్మ సిన్హా  వివరించారు. ఈ ప్రమాదానికి  ఓవర్ స్పీడ్  కారణం కాదని  ఆమె  అభిప్రాయపడ్డారు.  ప్రమాదం  జరిగిన సమయంలో   కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు  120 కి.మీ వేగంతో  ప్రయాణం  చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  మరోవైపు  యశ్వంత్  పూర్  గంటకు  124 కి.మీ. వేగంతో  ప్రయాణిస్తుందని   జయవర్మ సిన్హా  వివరించారు.రెండు రైళ్లు నిర్ధేశిత వేగంతో  ప్రయాణిస్తున్నాయని  జయవర్మసిన్హా  చెప్పారు. 

కోరమండల్  ఎక్స్ ప్రెస్  రైలు  బోగీలు డౌన్ లైన్ పైకి వచ్చి  డౌన్ లైన్  నుండి గంటకు  126 కి.మీ వేంగతో  వెళ్తున్న యశ్వంత్ పూర్  ఎక్స్ ప్రెస్  చివరి రెండు బోగీలను   ఢీకొన్నాయని  జయవర్మ వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios