కేరళలో కేవలం 64 వేల మంది పేదలు ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. వారిని కూడా పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. 

2025 నాటికి రాష్ట్రాన్ని తీవ్ర పేదరికం నుంచి విముక్తం చేయడమే ఎల్డీఎఫ్ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. రాష్ట్రంలో కేవలం 64 వేల మంది మాత్రమే పేదలు ఉన్నారని చెప్పారు. వారిని కూడా పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పాలక్కాడ్‌ లోని ఫోర్ట్ మైదానంలో ఆయన ఉపాధిహామీ కార్మికుల సంక్షేమ నిధి బోర్డును సోమవారం ప్రారంభించారు.

త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు.. అరెస్టు చేసి, సిట్ విచారణకు ప్రభుత్వ ఆదేశం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో తీవ్ర పేదరికంలో ఉన్న వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు, ఒంటరి జీవితం గడుపుతున్న వారి సంఖ్యను వర్గీకరిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుపేదల సంఖ్య 64 వేలకు చేరిందని అన్నారు. వారిని పేదరికం నుంచి గట్టేక్కించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దీని కోసం 2025 నవంబర్ 1 వరకు టార్గెట్ గా నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.

అతిక్ అహ్మద్ తరహాలోనే.. యూపీ కోర్టులో ఇద్దరు హత్యా నిందితులపై దుండగుల కాల్పులు..

పేదరికంలో ఉన్న వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయని, స్థానికుల సహకారంతో స్థానిక సంస్థలు ఈ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నాయని సీఎం పినరయి తెలిపారు. ఈ ప్రయత్నానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం 2016లో రూ.600గా ఉన్న నెలవారీ సంక్షేమ పింఛన్ ను రూ.1600కు పెంచిందని ఆయన గుర్తు చేశారు. పెండింగ్ బకాయిలను కూడా పంపిణీ చేశామని తెలిపారు. కాగా.. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 62 లక్షల మంది సంక్షేమ పింఛన్లు పొందుతున్నారు. 2023 నవంబర్ 1న ప్రగతి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశానికి స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంబీ రాజేష్ అధ్యక్షత వహించారు. విద్యుత్ శాఖ మంత్రి కె.కృష్ణన్ కుట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. విష వాయువులు పీల్చి ఇద్దరు మృతి..

ఇదిలా ఉండగా.. వచ్చే మూడేళ్లలో కేరళలో ‘తీవ్ర పేదరికం’ తుడిచిపెట్టుకుపోతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ రెండు నెలల క్రితం పేర్కొన్నారు. ‘‘కేరళలో 3.42 లక్షల మంది భూమిలేని వారున్నారు. వీరికి మూడు సెంట్ల చొప్పున భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 10,500 ఎకరాల భూమి అవసరం. దీని కోసం ఇప్పటికే భూమిని ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన వారందరికీ భూమిని అప్పగిస్తే జీరో ల్యాండ్ లెస్ ఉన్న తొలి రాష్ట్రంగా కేరళ అవతరిస్తుంది.’’ అని ఆయన అన్నారు.