Covishield Booster Dose: బూస్ట‌ర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలంటే..?

 Covishield Booster Dose: ఒమిక్రాన్ వ్యాప్తి​ నేపథ్యంలో బూస్టర్​ డోసు తీసుకోవచ్చని కేంద్రం ఆమోదించింది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మూడో డోసు తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. ఈ డోస్ ఆమోదం కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు ప్రతిపాదనలను పంపించింది

UNION HEALTH MINISTRY INFORMED A PARLIAMENTARY PANEL ON A BOOSTER DOSE

Covishield Booster Dose:  ప్రాణాంతక ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ కేవలం రెండు వారాల వ్య‌వ‌ధిలోనే 57 దేశాల‌కు విస్త‌రించింది. క్ర‌మంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఈ వేరియంట్ భార‌త్ లోకి కూడా ప్ర‌వేశించింది. పలు రాష్ట్రాల్లో తిష్ఠ వేసింది. ఇప్పటి వ‌ర‌కూ మ‌న దేశంలో 25కు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌, ఢిల్లీలల్లో కొత్త వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశం మ‌రోసారి పానిక్ మోడ్ లోకి వెళ్లింది. 

మ‌రోవైపు దేశంలో మరోసారి కరోనా త‌న విశ్వ‌రూపం చూపించ‌నున్న‌ద‌నీ, థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌ద‌నీ, దేశంలో క‌రోనా డేంజర్ బెల్స్ మోగబోతుందనీ, ప్ర‌స్తుతం కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న.. ఫిబ్ర‌వ‌రి, మార్చి క‌ల్లా.. పీక్స్ కు చేరుకుంటాయని వైద్య నిపుణులు హెచ్చ‌రించారు. దీంతో స‌ర్వ‌త్రా భ‌యాందోళ‌న‌లు వెల్లువెత్తున్నాయి.
 ఇదే త‌రుణంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్యూ హెచ్ ఓ) కూడా ప్ర‌పంచ దేశాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తుంది. ఒమిక్రాన్ నుంచి తప్పించుకోవాలంటే.. మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక ఆయుధం వ్యాకినేష‌న్ అనీ, వ్యాక్సినేష‌న్ చేయించుకున్న వారిలో ఈ వేరియంట్ ప్ర‌భావం కాస్త త‌క్కువ‌గా ఉంటుందని ప్ర‌క‌టించింది. అలాగే.. రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు... మూడో డోస్ గా బూస్ట‌ర్ ను వేసుకోవాలని వైద్య నిపుణులు భావిస్తోన్న విష‌యం తెలిసిందే.. 

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/omicron-fear-for-ap-12-500-people-from-abroad-in-just-10-days-new-trouble-to-officials-r3w2sd

దీంతో.. గత కొద్దికాలంగా బూస్టర్ డోసుల పంపిణీపై చ‌ర్చ జరుగుతోంది. ప్ర‌స్తుత ప‌రిమాణంలో ఈ చ‌ర్చ మ‌రింత‌ జోరందుకుంది. చాలా రాష్ట్రాల నుంచి కేంద్రానికి బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్రం కూడా ఇదే అంశంపై గురువారం సమావేశం నిర్వహించింది. బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించిన‌ట్టు తెలిపింది. ఈ స‌మావేశంలో ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స‌భ్యులు హాజరయ్యారు. 

అవసరమైతే, మూడో డోసు తీసుకోవచ్చని, అయితే రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మాత్రమే తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది.  ఈ బూస్ట‌ర్ టీకా ప్ర‌భావం.. క‌రోనా ప‌లు వేరియంట్ల ప్ర‌భావం ఉంటుంద‌ని,  బూస్టర్ డోసు అందుబాటులోకి వస్తే ఓమిక్రాన్ వేరియంట్ ను సమర్థవంతంగా ఎదురుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయం ప‌డ్డారు. ముందుగా వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ డోసులు ఇవ్వాలని డిమాండ్లు ఉన్నాయి

Read also: https://telugu.asianetnews.com/international/omicron-four-times-more-transmissible-than-delta-in-new-study-r3uhh0

ఈ బూస్ట‌ర్ డోసుల‌ను మహారాష్ట్రలోని పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  తయారు చేస్తోంది. కోవిషీల్డ్ బూస్టర్ డోస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి అవసరమైన అనుమతులను మంజూరు చేయాలంటూ కొద్దిరోజుల కిందటే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు ప్రతిపాదనలను పంపించింది. ఇదే క్ర‌మంలో దేశంలో కావాల్సిన‌న్ని..  కోవిషీల్డ్ డోసులు నిల్వ ఉన్నాయని, ఆ డోసుల త‌యారీని నిలిపి చేసి.. బూస్టర్ డోస్‌ తయారీపై దృష్టి సారించామని సీరమ్ పేర్కొంది. దేశంలో బూస్టర్ డోస్ అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపించిన మొట్టమొదటి సంస్థ సీర‌మ్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios