నెట్టింట మరో డేంజరస్ ఛాలెంజ్.. ఎగపడుతున్న యువత

one more dangerous challenge is dragon breath
Highlights

ఇప్పుడు మరో డేంజర్ చాలెంజ్ వెలుగులోకి వచ్చింది. అదే డ్రాగన్ బ్రీత్. దీనిని కూడా యువత ఎగపడి మరీ ఛాలెంజ్ లు స్వీకరిస్తున్నారు.

మరో డేంజర్ ఛాలెంజ్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే సెలబ్రెటీల నుంచి కామన్ పీపుల్ వరకు కికీ ఛాలెంజ్ ని చేసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరో డేంజర్ చాలెంజ్ వెలుగులోకి వచ్చింది. అదే డ్రాగన్ బ్రీత్. దీనిని కూడా యువత ఎగపడి మరీ ఛాలెంజ్ లు స్వీకరిస్తున్నారు.

‘‘డ్రాగన్ బ్రీత్’’ పేరుతో పొగలు కక్కుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. లిక్విడ్ నైట్రోజన్‌లో క్యాండీలను ముంచుకుని తింటూ మంచులాంటి పొగను డ్రాగన్‌లా వదలడమే ‘‘డ్రాగన్స్ బ్రీత్’’.
 
అయితే ఈ తరహా ప్రయోగం వల్ల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నోటితో పాటు అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని అమెరికాలోని సఫోక్ కౌంటీ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ వీడియోలు చక్కర్లు కొడుతుండడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ‘‘ ధాన్యాలతో చేసిన పఫ్‌లను లిక్విడ్ నైట్రోజన్‌లో చల్లబర్చి తినే కొత్త తరహా ఆహారమే డ్రాగన్స్ బ్రీత్. లిక్విడ్ నైట్రోజన్ కారణంగా చర్మం, అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. దీన్ని పీల్చడం వల్ల ఆక్సిజన్ లోపించి ఆస్పిక్షేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంది...’’ అని సఫోక్ కౌంటీ ఆరోగ్య శాఖ వివరించింది.
 
ఇప్పటికే ఈ తరహా స్నాక్ తినడం వల్ల ఫ్లోరిడాలోని ఓ బాలుడు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో డ్రాగన్ బ్రీత్ వల్ల జరిగే అనర్ధాలపై హెచ్చరిస్తూ అతడి తల్లి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. కాబట్టి ఈ తరహా ప్రయత్నాలు మానుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గతేడాది గుర్గావ్‌లో లిక్విడ్ నైట్రోజన్‌తో కాక్‌టైల్ తాగిన ఓ యువకుడికి ‘‘దాదాపు సగం జీర్ణాశయాన్ని’’ తొలగించాల్సి వచ్చింది.

loader