సారాంశం

బీహార్ రాష్ట్రంలోని కాటియార్ లో బుధవారంనాడు జరిగిన పోలీస్ కాల్పుల్లో  ఒకరు మృతి చెందారు.

పాట్నా: బీహార్ రాష్ట్రంలోని కాటియార్ లో  బుధవారంనాడు నిరసనకారులపై  పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు.మరో ఇద్దరు గాయపడ్డారు. విద్యుత్ పై  బార్సోయ్ బ్లాక్ ఆఫీస్ ఆవరణలో  ఇవాళ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది.  

విద్యుత్ కోతలను నిరసిస్తూ  ఆందోళనకారులను అదుపు చేసేందుకు  పోలీసులు  లాఠీచార్జీ చేశారు. గాల్లోకి కాల్పులకు దిగారు.  ఈ ఘటనలో  ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని బార్సోయ్  డీఎస్‌పీ  ప్రేమ్ నాథ్ రామ్ ధృవీకరించారు. మృతి చెందిన వ్యక్తిని  ఛచ్నాలోని బసల్ గ్రామానికి చెందిన  మహ్మద్ ఖుర్షీద్ ఆలం గా గుర్తించారు. గాయపడిన వారిని నియాజ్ గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. నిర్వహణ పనుల నిమిత్తం  ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు  విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళనకారులు చెబుతున్నారు.