దేశరాజధానిలో తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో సీఏఏకి వ్యతిరేక, అనుకూల  ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలు వణికిపోయే రీతిలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. తొలుత ఆందోళనలుగా మొదలై తర్వాత అల్లర్లకు దారి తీశాయి. ఈ అల్లర్ల కారణంగా 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

అయితే... అధికారులు , ప్రభుత్వం రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్క పెట్టారు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకనే సమయంలో ఢిల్లీలో మళ్లీ అల్లర్లు మొదలయ్యాయంటూ పుకార్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రోడ్డు మీద ఉంటే..ప్రాణాలకు ప్రమాదమని భావించి తమ ఇళ్లకు వెళ్లేందుకు పరుగులు తీశారు.

Also Read కుదురుకుంటున్న ఈశాన్య ఢిల్లీ: షాహీన్‌బాగ్‌లో మళ్లీ అల్లర్లు, 144 సెక్షన్...

ఈ క్రమంలో బట్లా ప్రాంతానికి చెందిన  ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అందరూ ఒకేసారి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగడంతో అతను చనిపోవడం గమనార్హం. తొక్కిసలాట కారణంగా ఆయన తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కాగా.. ఆదివారం సాయంత్రం  7 గంటల తరువాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వదంతులు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇటువంటి వదంతులను నమ్మవద్దని ఒక ట్వీట్‌లో ప్రజలకు తెలియజేశారు. పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని, ఎక్కడా హింసాయుత ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. సోషల్ మీడియాలో ఇటువంటి వదంతులు వ్యాపింపచేసే వారిపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.