తిరువనంతపురం: గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందిన ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా కేరళ అటవీ శాఖ మంత్రి కె.రాజు శుక్రవారం నాడు ప్రకటించారు.
ఏనుగు మృతి చెందిన ఘటనలో ఒక్కరే కాదు మరికొందరు ఉన్నారని మంత్రి తెలిపారు. మిగిలిన వారిని కూడ పట్టుకొనేందుకు వేట సాగుతోందని  ఆయన తెలిపారు.

గత నెల 27వ తేదీన గర్భంతో ఉన్న ఏనుగు వెల్లియార్ నదిలో ఏనుగు మరణించిన విషయం తెలిసిందే. పేలుడు పదార్ధాలు ఉన్న పైనాపిల్ పండు తినడం వల్లే ఏనుగు మృతి చెందిందని విమర్శలు వచ్చాయి.

రెండు వారాల పాటు ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్లే ఏనుగు మృతి చెందిందని పోస్టుమార్టం నివేదిక తెలిపింది.

also read:పోస్టు మార్టం నివేదిక: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారణమిదీ

అటవీ జంతువుల నుండి పంటను రక్షించేందుకు గాను పేలుడు పదార్ధాలను నింపిన పండ్లను జంతువులు తినేలా రైతులు ఏర్పాటు చేస్తారని కొందరు అధికారులు చెబుతున్నారు.ఈ ఏనుగుకు ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా ఈ పండ్లు తినిపించారా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు