తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని  గర్భంతో ఉన్న ఏనుగు  మృతికి కారణాలను పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వెల్లడించింది.

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని వెల్లియార్ నదిలో ఓ ఏనుగు  ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఏనుగు మృతికి గల కారణాలపై పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది.

రెండు వారాలుగా ఏనుగు కనీసం నీళ్లు కానీ ఆహారం తీసుకోలేదని పోస్టుమార్టం నివేదికలో తెలిపింది.ఏనుగు నోటిలో గాయాలు ఉన్నట్టుగా పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఏనుగు నోటిలో పేలుడు వల్లే ఈ గాయాలు అయినట్టుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

also read:మానవత్వానికే మచ్చ: ఏనుగును చంపిన దుండగులను శిక్షించాలంటూ నెటిజన్ల ఫైర్

ఏనుగు ఊపిరితిత్తులు కూడ చెడిపోయినట్టుగా పోస్టుమార్టం నివేదిక ప్రకటించింది.  ఏనుగు దవడ విరిగిపోయింది. అంతేకాదు దవడకు తీవ్ర గాయాలైనట్టుగా కూడ ఈ నివేదిక తెలిపింది.  పేలుడు పదార్ధాలు నింపిన పండును ఏనుగు తిన్నదా... ఎవరైనా  ఉద్దేశ్యపూర్వకంగా ఏనుగుకు ఈ పండు తినిపించారా అనే విషయమై పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ ఘటనపై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.