షాకింగ్.. ఏడునెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఒకటిన్నర సెంటీమీటర్ల ఎల్ఈడి బల్బు..

ఓ ఏడు నెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఎల్ఈడీ బల్బు వెలుగు చూడడం.. అందర్నీ షాక్ కి గురి చేసింది. ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో వెలుగుచూసింది. 

One and a half centimeter LED bulb found in seven-month-old  lungs in kerala - bsb

కేరళ : కేరళలోని కొట్టాయంలో ఒళ్ళు జలదరించే ఘటన వెలుగు చూసింది. ఏడు నెలల చిన్నారి తీవ్రమైన దగ్గు, ఊపిరి ఆడక పోవడం,  జ్వరంతో బాధపడుతున్నాడు. ఎంత చికిత్స చేసినా దాని నుండి కోలుకోకపోవడంతో.. డాక్టర్లు ఎక్స్ రే తీశారు. అందులో కనిపించింది చూసి షాక్ అయ్యారు. ఆ చిన్నారి ఊపిరితిత్తుల్లో ఒకటిన్నర సెంటీమీటర్ల ఎల్ఈడి బల్బ్ కనిపించింది. వెంటనే శస్త్ర చికిత్స చేసి దానిని బయటకు తీశారు.

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే... కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ దంపతుల ఏడు నెలల చిన్నారి చాలా రోజులుగా తీవ్రమైన దగ్గు, జ్వరం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్నాడు.  దీంతో ప్రైవేట్ క్లినిక్ లో చిన్నారికి చికిత్స అందించారు. కానీ, ఎంతకీ తగ్గకపోవడంతో ఎక్స్ రే తీయగా ఊపిరితిత్తుల్లో ఏదో వస్తువు ఉన్నట్లుగా గుర్తించారు.

ఐదు, ఏడేళ్ల వయసున్న చెల్లెళ్లను గొంతుకోసి చంపిన అక్క.. కారణం తెలిస్తే..

వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని అమృత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బ్రొంకోస్కోపీ చేయగా అందులో కుడి ఊపిరితిత్తుల కింద ఇనుము లాంటి వస్తువు ఉన్నట్లుగా కనిపించింది. ఆ వస్తువు చుట్టూ రక్తం, శరీరంలోని మిగతా రకరకాల ఫ్లూయిడ్స్ కప్పి ఉండడంతో ఎల్ఈడీ బల్బు అని గుర్తించలేకపోయారు. నెమ్మదిగా ఆ వస్తువును బయటికి తీసిన తర్వాత పరిశీలించగా అది ఎల్ఈడి బల్బ్ అని తేలి షాక్ అయ్యారు.

ఒకటిన్నర సెంటీమీటర్ల పొడవున్న ఎర్రటి  ఎల్ఈడి బల్బ్ అది అని చెప్పారు. అమృత హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ టింకు జోసెఫ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం  ఈ వైద్య ప్రక్రియను చేశారు. ఇప్పుడు మార్కెట్లో లభించే చాలా బొమ్మల్లో ఎల్ఈడి బల్బులు ఉంటున్నాయి. 

పిల్లలు వాటిని తెలియకుండా నోట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని డాక్టర్లు చెప్పుకొచ్చారు. అదృష్టవశాత్తు ఆ ఎల్ఈడి బల్బు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందని… దీనివల్ల పెను ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెబుతున్నారు. అలా కాకుండా శ్వాసనాళంలో ఇంకెక్కడైనా ఇరుక్కుపోయినట్లయితే, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి చిన్నారి మరణానికి దారి తీసేదని అంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios