ఐదు, ఏడేళ్ల వయసున్న చెల్లెళ్లను గొంతుకోసి చంపిన అక్క.. కారణం తెలిస్తే..
ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు హత్యకు గురయ్యారు. హత్య చేసింది వారి అక్కే అని తేలింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ తన ఇద్దరు చెల్లెళ్లను దారుణంగా హతమార్చింది. తన చెల్లెళ్లిద్దరూ తనను అభ్యంతరకర స్థితిలో చూడడంతో.. వారిని పారతో గొంతు కోసి చంపింది. దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
నిందితురాలిని అంజలిగా గుర్తించారు. ఆమె నేరం చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. సోమవారం, ఐదు, ఏడేళ్ల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్లు వారి ఇంట్లో గొంతు కోసి హత్య చేయబడ్డారు. ఘటన జరిగినప్పుడు శిల్పి, రోష్ని అనే ఆ ఇద్దరు బాధితులు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు.
ఎన్నికల సంఘంపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ ఫైర్.. స్థానిక ఎన్నికలు వద్దు, లోక్ సభ ఎన్నికలు ముద్దు?
దీనికి సమాచారం అందడంతో వెంటనే కాన్పూర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితులు, నిందితురాలి తల్లి సుశీల తాను ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మేత సేకరించేందుకు వెళ్లి, సాయంత్రం 5 గంటలకు తిరిగివచ్చినట్లు పోలీసులకు తెలిపారు.
ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానంతో లోపలికి వెళ్ల చూడగా... బాలికలు శవమై పడి ఉన్నారు. కుటుంబ సభ్యులను విచారించగా అక్క అంజలి నేరం అంగీకరించింది. ఇద్దరు అమ్మాయిలు అంజలిని అభ్యంతరకర స్థితిలో చూశారు. దీంతో తన గురించి అందరికీ చెప్పేస్తారని ఆమె వారిని పారతో చంపేసింది. సాక్ష్యాలను వదిలించుకోవడానికి ఆమె తన బట్టలు ఉతికి, పారను కూడా శుభ్రం చేసింది.
"పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, పారకు ఉన్న రక్తపు మరకలు క్లీన్ చేసి ఉన్నాయి. వారు ఆ పారను హత్యాయుధంగా స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కొన్ని బట్టలు ఆరేసి ఉండడం కూడా కనిపించింది’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసుల విచారణలో అక్క నేరం ఒప్పుకుంది. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.