Asianet News TeluguAsianet News Telugu

మరోసారి మోడీ సర్కార్ : పాన్ ఇండియా లెవల్లో బీజేపీ ప్రచారగీతం.. ఎన్ని భాషల్లోనంటే...

భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్’ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచారానికి సంబంధించిన పాటను ఆవిష్కరించారు.

Once again Modi Sarkar : Pan India level campaign song, in how many languages - bsb
Author
First Published Feb 19, 2024, 1:43 PM IST | Last Updated Feb 19, 2024, 1:44 PM IST

ఢిల్లీ : భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మోదీ సర్కార్ ప్రచారానికి మరోసారి తెరలేచింది. ఈ సందర్భంగా ప్రచారానికి సంబంధించిన పాటను ఆవిష్కరించారు. ఈ పాట 24 భాషల్లో విడుదలైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ పాటను ఉపయోగించనున్నారు. ఈ పాట సమగ్రత నేపథ్యంపై దృష్టి పెడుతుంది. ఈ పాట ద్వారా వివిధ అంశాలు హైలైట్ అయ్యాయి.

ఇందులో రైతులు, అసంఘటిత కార్మికులు, మహిళలు, యువత, దేశంలోని అపూర్వమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి, చంద్రయాన్-3 మిషన్, రామ మందిర నిర్మాణం వంటి మోడీ హయాంలో సాధించిన విజయాలు  ఉన్నాయి.

జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ, అనేక ప్రాజెక్టులు జాతికి అంకితం.. పూర్తి వివరాలివే...

ఈ పాట ఎన్ని భాషల్లో విడుదలయ్యిందంటే... 
 
హిందీ, సింధీ, డోగ్రి, బుందేలి, హర్యాన్వి, గారో, అస్సామీ,ఒరియా,సంతాలి, భోజ్‌పురి, పంజాబీ, గుజరాతీ, తమిళం, కష్మెరె, నాగ, సంస్కృతం, కన్నడ, కుమాయోని, బెంగాలీ, మార్వాడీ, ఆంగ్ల, తెలుగు, మరాఠీ, మలయాళంలాంటి 24 భాషల్లో ఈ పాట తయారు చేశారు. 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు..

‘మరోసారి మోడీ ప్రభుత్వం’ అనే ప్రచారాన్ని జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారని తెలిపారు. మోడీ సర్కార్‌ థీమ్‌పై మరోసారి వాల్‌ పెయింటింగ్‌ లు వేస్తారు. ప్రచారంలో భాగంగా బీజేపీ 360 డిగ్రీల విధానాన్ని అవలంబిస్తోంది. అలా బీజేపీ దేశంలోని ప్రతి అంశాన్ని టచ్ చేయాలనుకుంటోంది.

ఈ పాటతో పాటు www.ekbaarphirsemonisarkar.bjp.org అనే వెబ్‌సైట్‌ను కూడా ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రారంభించింది. దీనికి ముందు, దేశంలోని 30 లక్షల మంది ప్రజలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రకు ఓటు వేస్తామని ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios