Asianet News TeluguAsianet News Telugu

క‌ర్నాట‌క నుంచి పారిపోయిన ఒమ్రికాన్ సోకిన విదేశీయుడు..ఆల‌స్యంగా వెలుగులోకి..

ఒమ్రికాన్ పాజిటివ్ గా నిర్ధారించబడిన వ్యక్తి కర్నాటక నుంచి దుబాయ్ కు వెళ్లిపోయాడు. జీనోమ్ సీక్వెన్సీలో ఫలితం పాజిటివ్ గా వచ్చే సమయాని అతడు తన హోటల్ రూం ఖాళీ చేసి వెళ్లిపోయాడు.  

Omrikan infected foreigner flees from Karnataka
Author
Hyderabad, First Published Dec 3, 2021, 6:46 PM IST

ఒమ్రికాన్ పాజిటివ్ వ‌చ్చిన ఓ విదేశీయుడు పారిపోయిన ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. ఒమ్రికాన్ పాజిటివ్ వ‌చ్చిన ఇద్ద‌రిలో ఒక‌రు ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి నెగెటివ్ స‌ర్టిఫికెట్ తీసుకుని తిరిగి స్వ‌స్థ‌లానికి వెళ్లిపోయార‌ని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అలాగే ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చిన 10 మంది ప్ర‌యాణీకులకు నిర్వ‌హించ‌కుండానే వారు క‌నిపించ‌కుండా పోయారు. వారి కోసం ప్ర‌స్తుతం త‌మ అధికారులు వెతుకుతున్నార‌ని, ఈ రోజు రాత్రి వర‌కు వారి ఆచూకీ క‌నిపెడ‌తామ‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  ఈ విషయం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌రం రేపుతోంది. 

నవంబర్ 20న కర్నాటకకు వచ్చిన దక్షిణాఫ్రికా జాతీయుడు..
గత నెల 20వ తారీఖున 66 ఏళ్ల ద‌క్షిణాఫ్రికా జాతీయుడు క‌ర్నాట‌కకు వ‌చ్చారు. అత‌డు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు, క‌రోనా నెగిటివ్ స‌ర్టిఫికెట్ త‌న వెంట తీసుకొని వ‌చ్చారు. అదే రోజు ఆయ‌న షాంగ్రి లా అనే హోటల్ లో బ‌స చేశాడు. ఆ స‌మ‌యంలోనే అత‌డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డ్డాడు. అత‌డిని ప్ర‌భుత్వ వైద్యుడు ప‌రిశీలించిన స‌మ‌యంలో ఆ వ్య‌క్తిలో క‌రోనా ల‌క్ష‌ణాలేవీ లేక‌పోవ‌డంతో, క్వారంటైన్ ఉండాల్సిందిగా సూచించారు. అయితే ఆ ద‌క్షిణాఫ్రికా జాతీయుడు రిస్క్ దేశాల లిస్ట్‌లో నుంచి వ‌చ్చినందున అత‌డి నుంచి సేక‌రించిన న‌మూనాల‌ను నవంబ‌ర్ 22వ తేదీన జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అయితే అత‌డు నవంబ‌ర్ 23న ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో మ‌ళ్లీ క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో నెగెటివ్‌గా ఫ‌లితం వ‌చ్చింది. దీంతో అత‌డు న‌వంబ‌ర్ 27వ తేదీన క్యాబ్ తీసుకొని విమానాశ్ర‌యానికి వెళ్లి అక్క‌డి నుంచి దుబాయ్‌కు వెళ్లాడు. అత‌డు బ‌య‌లుదేరిన స‌మ‌యంలోనే అత‌డికి ఒమ్రికాన్ వేరియంట్ సోకిన‌ట్టుగా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో అత‌డితో కాంటాక్ట్‌లో ఉన్న మ‌రో 24 మందిని ప‌రీక్షించారు. వారికి కోవిడ్ -19గా నిర్ధార‌ణ అయ్యింది. సెకండ‌రీ కాంటాక్ట్‌గా గుర్తించిన మ‌రో 240 మందిని ప‌రీక్షించగా వారు కూడా నెగిటివ్‌గా ఉన్న‌ట్టు నిర్ధారించారు. ఈ విష‌యాల‌న్నీ ఉన్న‌త స్థాయి స‌మావేశం అనంత‌రం ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ నిర్ధారించారు. 
‘ఈ విష‌యంలో ఎలా త‌ప్పు జ‌రిగిందో ప‌రిశీలిస్తున్నాం. షాంగ్రి లా హోటల్ ఏం త‌ప్పు జ‌రిగిందో తెలుసుకునేందుకు మేము పోలీసుల‌కు ఫిర్యాదు చేశాం. నిజాల‌న్నీ వారు నిర్ధారిస్తారు’ అని మంత్రి తెలిపారు. అలాగే ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చి, ఎలాంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోకుండానే త‌ప్పించుకుపోయిన 10 మంది ప్రయాణీకుల జాడ కోసం తాము వెతుకుతున్నామ‌ని చెప్పారు. ఈ విష‌యానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు తెలిపారు. 

https://telugu.asianetnews.com/national/no-evidence-to-suggest-existing-vaccines-don-t-work-on-omicron-r3jf06

ప్రయాణికులు సామాజిక బాధ్య‌త క‌న‌బ‌ర్చాలి - కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి 
ఒమ్రికాన్ వేరియంట్ ను గుర్తించిన ద‌క్షిణాఫ్రికా నుంచి 57 మంది ప్రయాణికులు వ‌చ్చార‌ని క‌ర్నాట‌క ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ కే.సుధాక‌ర్ తెలిపారు. 57 మందిలో 10 మంది ఎలాంటి ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోకుండా త‌ప్పించుకొని పారిపోయార‌ని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం వారి ఫోన్లు స్విఛ్ ఆఫ్‌లో ఉన్నాయ‌ని అన్నారు. క‌రోనా కాంటాక్ట్‌ల‌ను గుర్తించ‌డంలో గ‌తంలో త‌మ పోలీసులు ప్ర‌తిభ క‌న‌బ‌ర్చార‌ని, వారు త‌ప్ప‌కుండా ఆ ప‌ది 10 ప్ర‌యాణికుల ఆచూకీ క‌నిపెడ‌తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌యాణికులు కూడా సామాజిక శ్ర‌ద్ద‌తో, బాధ్య‌త‌తో వ‌వ‌హ‌రించాల‌ని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios