ఒమిక్రాన్.. సాధారణ వైరల్ ఫీవర్ మాత్రమే.. కానీ, జాగ్రత్తగా ఉండాలి: యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒమిక్రాన్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ సాధారణమైన ఒక వైరల్ ఫీవర్ అని అన్నారు. డెల్టా వేరియంట్ కంటే ఇది చాలా బలహీనమైనదని వివరించారు. అయితే, ఏ వ్యాధికైనా జాగ్రత్తగా మసులుకోవడం అవసరం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ కట్టడి కోసం నైట్ కర్ఫ్యూ విధించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని వివరించారు.

omicron variant is a common viral fever says UP CM yogi adityanath

లక్నో: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అత్యధిక వేగంతో వ్యాపిస్తూ ప్రపంచాన్నే వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కేవలం ఒక సాధారణ వైరల్ ఫీవర్(Common Viral Fever) మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తున్నది ఎంత నిజమో.. అది అంతే బలహీనమైనది అనడం అంతే నిజమని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే, ఏ వ్యాధికైనా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రోజు విలేకరులతో మాట్లాడారు.

‘ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నదనే నిజం. అయితే, సెకండ్ వేవ్‌తో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్ చాలా బలహీనం అనేది కూడా అంతే నిజం. ఇది కేవలం ఒక సాధారణ వైరల్ ఫీవర్. కానీ, ఏ వ్యాధికైనా ముందు జాగ్రత్తలు అవసరం. కానీ, భయపడాల్సిన అవసరం లేదు’ అని సీఎం యోగి ఆదిత్యానాథ్ వివరించారు. గతేడాది మార్చి- ఏప్రిల్‌లో డెల్టా వేరియంట్‌తో సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ సెకండ్ వేవ్‌ను తాజాగా సీఎం యోగి గుర్తు చేశారు. డెల్టా వేరియంట్ బారిన పడ్డ పేషెంట్లు.. కోలుకోవడానికి 15 నుంచి 25 రోజులు పట్టిందని సీఎం అన్నారు. అప్పుడు డెల్టా వేరియంట్ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల బారిన పడ్డారని వివరించారు. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితి భిన్నమైనదని అన్నారు.

Also Read: పశ్చిమబెంగాల్ లో ఒమిక్రాన్ టెన్షన్.. స్కూళ్లు, సినిమా హాళ్లు బంద్, లాక్ డౌన్ తలపించే నిబంధనలు..

ఇప్పటి వరకు ఒమిక్రాన్ భిన్నంగా కనిపిస్తున్నదని సీఎం యోగి అన్నారు. ఈ వైరస్ చాలా బలహీనమైనది అని వివరించారు. కానీ, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలని సూచించారు. వైరస్ కట్టడి కోసం ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అన్నారు. అందులో ఇప్పటి వరకు ముగ్గురు రికవరీ అయ్యారని చెప్పారు. మిగతా వారు హోం ఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపారు.

15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ కార్యక్రమం గురించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 1.4 కోట్ల మంది పిల్లలకు టీకా పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,150 టీకా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, 18 ఏళ్ల పైబడిన వారిలో 20.25 కోట్ల మంది లబ్దిదారులకు టీకాలను పంపిణీ చేసినట్టు వివరించారు.

Also Read: Coronavirus: మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా

సోమ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుత వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 33,750 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డ‌వారి సంఖ్య 3,49,22,882 కు చేరింది. నిన్న‌టితో పోలిస్తే.. 22 శాతం కొత్త కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో కొత్త‌గా 10,846 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,95,407కు పెరిగింది. 

ఆదివారం కొత్తగా 123 ఒమిక్రాన్‌ కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 1700కు చేరింది. ఇప్పటివరకు 639 మంది కోలుకున్నారు. దేశంలోని ఒమిక్రాన్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో 510 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఢిల్లీ 351, కేరళ 156, గుజరాత్‌ 136, తమిళనాడు 121, రాజస్థాన్‌ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 చొప్పున ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.  నమోదయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios