ఒమిక్రాన్ పేషెంట్లు మందులు లేకుండానే కోలుకున్నారు - ఎల్‌ఎన్‌జేపీ సీనియర్ డాక్టర్ సురేష్ కుమార్
ప్రజల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ డాక్టర్ స్పందించారు. తమ హాస్పిటల్ ఈ వేరియంట్ సోకిన 40 మంది ఎలాంటి మందులూ, స్టెరాయిడ్స్ లేకుండానే కోలుకున్నారని చెప్పారు. ఆక్సిజన్ కూడా అవసరం రాలేదని చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విస్తరిస్తోంది. ప్రపంచ దేశాలను ఈ కొత్త వేరియంట్ ఆందోళనకు గురిచేస్తోంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఒమిక్రాన్ సోకిందని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 91 శాతం మంది వ్యాక్సిన్ వేసుకున్నవారే ఉన్నాయని చెప్పారు. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రజల్లో ఇంకా భయాలు ఎక్కువయ్యాయి. వ్యాక్సిన్ కూడా ఈ వేరియంట్ నుంచి కాపాడలేకపోతోందని ఆందోళన చెందారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీకి చెందిన సీనియర్ డాక్టర్ చెప్పారు.
నాగాలాండ్‌లో వివాదాస్పద చట్టం AFSPA ఉపసంహరణపై కమిటీ.. 45 రోజుల్లో నివేదిక.. సీఎంలతో అమిత్ షా భేటీ
ఆక్సిజన్, స్టెరాయిడ్స్ అవరసం లేదట..
ఒమిక్రాన్ సోకిన పేషెంట్లు ఎలాంటి మందులూ వాడకుండానే కోలుకున్నారని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) హాస్పిటల్ సీనియర్ డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. ఆయన ఎల్ఎన్‌జీపీ హాస్పిటల్‌కు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ హాస్పిటల్‌లో మొత్తం 51 మంది ఓమిక్రాన్ రోగులు చేరారని చెప్పారు. వారిలో 40 మంది కరోనా నుంచి విజయవంతంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఒమిక్రాన్ సోకిన రోగుల్లో ఎక్కువశాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. ఆ పేషెంట్లకు ఆక్సిజన్ పెట్టాల్సిన అసరమే రాలేదని అన్నారు. వారికి మందులు గానీ, రెమిడిసివిర్ వంట స్టెరాయిడ్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. వారంతా కోలుకొని సురక్షితంగా ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు. కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నిరక్ష్యంగా కూడా ఉండొద్దని సూచించారు ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. భౌతికదూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని చెప్పారు. తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు.
గోవాలో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ కే ఉంది- కాంగ్రెస్ నాయకుడు చిదంబరం
దేశంలో 422కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు..
ఇండియాలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 422 కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇందులో 130 మంది కోలుకొని ఇంటికి వెళ్లిపోయారని చెప్పింది. ఇందులో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అయితే అందులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసులను చేర్చలేదు. మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గుజరాత్‌లో 43 కేసులు ఉన్నాయి. తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి 144 కేసులు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 2 కేసులు ఉన్నాయి. అయితే ఈ ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వారియర్స్ కు, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్‌కు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు మరో మోతాదు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి తెలిపింది. అయితే దీనిని బూస్టర్ డోసు అని మాత్రం చెప్పలేదు. అలాగే వ్యాక్సినేషన్ లో వెనకబడిన, కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న 10 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపించాలని నిర్ణయించింది.