Asianet News TeluguAsianet News Telugu

Omicron surge: కేర‌ళ‌పై క‌రోనా పంజా.. 50 శాతం బెడ్లు క‌రోనా రోగుల‌కు కేటాయించాల‌న్న స‌ర్కారు !

Omicron surge: కేర‌ళ‌లో రోజువారీ క‌రోనా వైర‌స్ కేసులు 40 వేల‌కు పైగా న‌మోదుకావ‌డం.. రాష్ట్రంలో వైర‌స్ ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. సాధార‌ణ క‌రోనా కేసుల‌తో పాటు గ‌తేడాది న‌వంబ‌ర్ లో ద‌క్షిణాఫ్రికాలో మొద‌ట‌గా గుర్తించిన క‌రోనా వైర‌స్ (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron ) కేసులు సైతం గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృత్వంలోని కేర‌ళ స‌ర్కారు.. కోవిడ్‌-19 నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది.
 

Omicron surge: Kerala government asks private hospitals to set aside 50 per cent beds for COVID patients
Author
Hyderabad, First Published Jan 22, 2022, 11:44 PM IST

Omicron surge: యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది. 2019లో చైనాలో వెలుగుచూసిన ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి అతి త‌క్కువ కాలంలోనే అన్ని దేశాల‌కు వ్యాపించింది. నిత్యం అనేక మ్యుటేష‌న్ల‌కు లోన‌వుతూ అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతోంది. ఇదివ‌ర‌కు Coronavirus డెల్టా వేరియంట్ అన్ని దేశాల్లోనూ పంజా విసిరి.. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకోగా.. ప్ర‌స్తుతం దాని కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ (Omicron) విజృంభిస్తోంది. దీంతో మ‌ళ్లీ క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ది. భార‌త్ లోనూ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ క‌రోనా వైర‌స్  (Coronavirus) కొత్త కేసులు లక్ష‌ల్లో న‌మోదుకావ‌డం కోవిడ్‌-19 ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ద‌క్షిణాధి రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుత‌న్నాయి. 

మ‌రీ ముఖ్యంగా కేర‌ళ‌లో రోజువారీ క‌రోనా వైర‌స్ కేసులు 40 వేల‌కు పైగా న‌మోదుకావ‌డం.. రాష్ట్రంలో వైర‌స్ ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. సాధార‌ణ క‌రోనా కేసుల‌తో పాటు గ‌తేడాది న‌వంబ‌ర్ లో ద‌క్షిణాఫ్రికాలో మొద‌ట‌గా గుర్తించిన క‌రోనా వైర‌స్ (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron ) కేసులు సైతం గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృత్వంలోని కేర‌ళ స‌ర్కారు.. కోవిడ్‌-19 నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. అలాగే, క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య మున్ముందు మ‌రింత‌గా పెరిగితే తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే కోవిడ్-19 రోగుల కోసం 50 శాతం పడకలను కేటాయించాలని కేరళ ప్రభుత్వం ప్ర‌యివేటు అస్పత్రుల‌ను కోరింది. అలాగే, ఆయా ఆస్ప‌త్రుల‌తో పాటు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోనూ ఐసీయూల్లో రోజువారీ అడ్మిషన్లు, వెంటిలేటర్లు, పడకల వినియోగం తదితర వివరాలను జిల్లా వైద్యాధికారులకు అందజేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కోరింది. 

"ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు తమ రోజువారీ ఐసీయూ అడ్మిషన్ల వివ‌రాల‌ను, వెంటిలేటర్ల వాడకంతో సహా ప‌డ‌క‌ల సంబంధిత పూర్తి వివ‌రాల‌ను డీఎంవోల‌కు స‌మ‌ర్పించాలి" అని కేర‌ళ స‌ర్కారు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత డేటాను అందజేయడానికి నిరాకరించిన  ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కేర‌ళ‌ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేర‌ళ‌లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,136 మంది క‌రోనా వైర‌స్ (Coronavirus) బారిన‌ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 5,74,702కు చేరుకుంది. అంత‌కు ముందు రాష్ట్రంలో 46,387 క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు న‌మోద‌య్యాయి. ఇది 2020 లో మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఒకే రోజులో న‌మోదైన అత్య‌ధిక (Coronavirus) కేసులు. 

"క‌రోనా వైర‌స్ (Coronavirus) మొదటి, సెకండ్‌ వేవ్ సమయంలో మాకు ప్ర‌యివేటు ఆస్పత్రుల నుండి అపారమైన మద్దతు లభించింది. ఈసారి కూడా మేము అదే విధమైన మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాము" అని కేర‌ళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. COVID-19 రోగుల కోసం 50 శాతం పడకలను కేటాయించాలని ప్ర‌యివేటు ఆస్పత్రులను ఆదేశించాలనే నిర్ణయం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రోజువారీ క‌రోనా వైర‌స్ స‌మీక్ష స‌మావేశంలో తీసుకోబ‌డింద‌ని తెలిపారు. అలాగే, అర్హులైన వ్యక్తులు వైరస్‌కు వ్యతిరేకంగా టీకా మోతాదులను త్వరగా తీసుకోవాల‌ని కోరారు. క‌రోనా నిబంధ‌న‌లు అంద‌రూ త‌ప్ప‌కుండా పాటించాల‌నీ, క‌రోనా (Coronavirus) బారిన‌ప‌డ‌కుండా జాగ్ర‌త్తలు తీసేకోవాల‌ని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios