కరోనా కలవరం... ఒమిక్రాన్ లో మూడు సబ్ వేరియంట్స్..!
కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉన్నప్పటికీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. ఈ మహమ్మారి గురించి మరో ఊహించని విషయం తెలిసింది.
కరోనా కొత్త వేరియంట్..ఒమిక్రాన్.. కలకలం సృష్టించడం మొదలుపెట్టింది. భారత్ లోనూ ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు 40కి చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. మరో మూడు కేసులు మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో వెలుగుచూశాయి. ఇప్పటివరకు అత్యధికంగా మహారాష్ట్రలో 18 మందికి ఈ కొత్త వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
Also Read: Omicron : ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఒమిక్రాన్ కేసు.. దేశవ్యాప్తంగా 38కి చేరుకున్న సంఖ్య..
కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉన్నప్పటికీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. ఈ మహమ్మారి గురించి మరో ఊహించని విషయం తెలిసింది. ఈ ఒమిక్రాన్ లోనూ మూడు సబ్ వేరియంట్లను నిపుణులు గుర్తించారు. వీటిలో రెండింటిని గత వారేమో గుర్తించడం గమనార్హం.
PANGOLIN(Phylogenetic Assignment Of named Global Out break Lineages) చేసిన పరిశోధనలో.. ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్లు కూడా ఉన్నాయని గుర్తించారు. ఇంగ్లాండ్ లో డిసెంబర్ 3వ తేదీన ఒమిక్రాన్ సాంపిల్ పై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
Also Read: టెస్టింగ్‌లో రోజుల తరబడి ఆలస్యానికి చెక్.. రెండు గంటల్లోనే ఒమిక్రాన్ రిజల్ట్
కరోనా మహమ్మారిలోనే ఒమిక్రాన్ వేరియంట్ అనుకుంటే.. ఈ ఒమిక్రాన్ లో కూడా .. సబ్ వేరియంట్లు కూడా ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. ఒమిక్రాన్ వేరియంట్ ని B.1.1529 గా పిలుస్తారు. కాగా... ఇది ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో BA.1, BA.2 రెండు భాగాలుగా విడిపోయి.. ప్రజలపై ఎటాక్ చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఏది ఎవరిపై ఎలా ఎటాక్ చేస్తుందో మాత్రం గుర్తించడం కష్టంగా ఉండటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఈ కొత్త వేరియంట్ ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తోందోనని జనం భయపడుతున్నారు. సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కలవరపెడుతోంది. వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి గాడిన పడుతోంది. లాక్‌డౌన్‌లతో నష్టపోయిన అన్ని వర్గాలూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ఓమిక్రాన్ కేసులు పెరుగడం అందరినీ ఆందోళకు గురి చేస్తోంది.