టెస్టింగ్‌లో రోజుల తరబడి ఆలస్యానికి చెక్.. రెండు గంటల్లోనే ఒమిక్రాన్ రిజల్ట్

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నిర్ధారణ కోసం చేస్తున్న పరీక్షల్లో రిజల్ట్ రావాలంటే రోజులకు రోజులు సమయం పడుతుండటంతో ఆలోపే బాధితులు పెరిగిపోతున్నారు. ఈ జాప్యాన్ని నివారించేందుకు ఐసీఎంఆర్ (icmr) రంగంలోకి దిగింది.

ICMR team designs kit to detect Omicron variant in 2 hours

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నిర్ధారణ కోసం చేస్తున్న పరీక్షల్లో రిజల్ట్ రావాలంటే రోజులకు రోజులు సమయం పడుతుండటంతో ఆలోపే బాధితులు పెరిగిపోతున్నారు. ఈ జాప్యాన్ని నివారించేందుకు ఐసీఎంఆర్ (icmr) రంగంలోకి దిగింది. దీంతో కేవలం రెండు గంటల్లోనే సదరు కరోనా బాధితుడికి సోకింది ఒమిక్రానా కాదా అన్న విషయం తెలిసిపోనుంది. 2 గంటల సమయంలోనే కొత్త వేరియంట్‌ను నిర్ధారించే టెస్టింగ్‌ కిట్‌ను రూపొందించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

ఒమిక్రాన్‌ భయంతో విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే అధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ ర్యాపిడ్‌-పీసీఆర్ టెస్టింగ్‌ చేస్తున్నారు. ఒకవేళ కరోనాగా నిర్ధారణయితే వాళ్ల శాంపిళ్లను జీనోమ్‌ సిక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లలో కరోనా సోకుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఫలితం ఆలస్యమవుతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేవలం టెస్టింగ్‌తోనే సదరు వ్యక్తికి సోకింది ఒమిక్రానా కాదా అన్న విషయం తెలిసిపోనుంది. ఐసీఎంఆర్‌ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ టెస్టింగ్‌ కిట్‌ను అభివృద్ధి చేశారు. బిశ్వజ్యోతి బొర్గకోటి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తయారు చేసిన టెస్టింగ్ కిట్ ద్వారా శాంపిల్స్ ఇచ్చిన 2 గంటల సమయంలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్ధారించవచ్చని తెలిపింది. 

ALso Read:ఏపీలో ఒమిక్రాన్ కేసు: ఐర్లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి వైరస్

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసులు నమోదైంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు దృవీకరించారు.విదేశాల నుండి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి Omicron సోకిందని అధికారులు స్పష్టం చేశారు. Ireland నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.ఐర్లాండ్ నుండి వచ్చిన ఈ ప్రయాణీకుడికి Mumbai ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తే కరోనా నెగిటివ్ గా వచ్చింది.Vizianagaram లో నిర్వహించిన Corona  రీ టెస్టులో కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో అతని శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఈ పరీక్షల్లో ఆ వ్యక్తికి  కరోనా ఒమిక్రాన్ ఉందని తేలింది. మరో వైపు యూకే నుండి ఢిల్లీకి ఢిల్లీ నుండి తిరుపతికి వచ్చిన ఓ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని వైద్యులు నిర్ధారించారు.  దీంతో దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కి చేరుకొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios