Asianet News TeluguAsianet News Telugu

ఒమిక్రాన్ ద‌డ : బెంగుళూర్‌లో ఆంక్ష‌ల స‌మ‌యం పొడ‌గింపు

కర్నాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలోనే కేసుల సంఖ్యలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. దీంతో అక్కడ కరోనా ఆంక్షలను పొడగించారు. 

Omicron Bank: Extension of sanctions period in Bangalore
Author
Bangalore, First Published Dec 31, 2021, 12:11 PM IST

ఒమిక్రాన్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. రోజు రోజుకు కొత్త వేరియంట్ పెరుగుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఒమిక్రాన్ వేరియంట్ అన్ని దేశాల‌కు విస్త‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 38 దేశాల్లో ఈ వేరియంట్ గుర్తించామ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. యూకేలో, ఉత్త‌ర అమెరికాలో దీని ప్ర‌భావం అధికంగా క‌నిపిస్తోంది. అక్క‌డ రోజుకు 10 వేల కంటే ఎక్కువ‌గా ఈ కొత్త వేరియంట్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో అన్ని దేశాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. మ‌న దేశంలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు డిసెంబ‌ర్ 2వ తేదీన క‌ర్నాట‌క రాష్ట్రంలోని బెంగ‌ళూర్ లో వెలుగులోకి వ‌చ్చాయి. మిగితా దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తున్న‌ప్పుడే భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంల‌తో, ముఖ్య అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఒమిక్రాన్ విస్త‌రించే అవ‌కాశం ఉన్నందున అన్ని రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

TAMILNADU RAINS : చెన్నైలో భారీ వ‌ర్షాల వ‌ల్ల ముగ్గురు మృతి.. 4 జిల్లాల్లో రెడ్ అలెర్ట్‌

ఈ నెల ప్రారంభంలో మొద‌టి రెండు ఒమిక్రాన్ కేసులు బ‌య‌టప‌డ్డాయి. ఇప్పుడు ఆ సంఖ్య 1200 వంద‌ల‌ను దాటింది. దాదాపు నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఇన్ని కేసులు న‌మోద‌వ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ఈ నేప‌థ్యంలో ఒమిక్రాన్ క‌ట్ట‌డికి అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్యలు చేప‌డుతున్నాయి. ఢిల్లీ, క‌ర్నాట‌క రాష్ట్రాలు ఇప్ప‌టికే క్రిస్మ‌స్ వేడుక‌లకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అలాగే న్యూయ‌ర్ వేడుక‌లు కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. అయితే కర్నాటక  ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. ఆ ఆంక్ష‌లు 31 తేదీ వ‌ర‌కు మాత్ర‌మే అమ‌లులో ఉంటాయ‌ని చెప్పింది. అయితే పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల నేప‌థ్యంలో ఆ ఆంక్ష‌ల‌ను ఇంకా కఠిన‌త‌రం చేసింది. స‌వ‌రించిన ఆంక్ష‌లు జ‌న‌వ‌రి 1వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

బెంగళూరులో  న్యూయ‌ర్ వేడుక‌ల కోసం బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడ‌టం నిషేద‌మ‌ని తెలిపింది. అయితే అపార్ట్‌మెంట్ ల‌లో, ప్రైవేట్ క్లబ్‌లలో అంతర్గత వేడుకలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని తెలిపింది. హోటల్‌లు, మాల్స్, రెస్టారెంట్‌లు, క్లబ్‌ల‌లో డీజే, ఈవెంట్ షోల‌ను ఏర్పాటు చేయ‌కూడద‌ని తెలిపింది. కోవిడ్ - 19 నిబంధ‌న ప్ర‌కారం రెగ్యుల‌ర్ గా జ‌రిగే కార్యకలాపాలు య‌థావిథిగా జ‌రుపుకోవ‌చ్చ‌ని చెప్పింది.

 సవతులతో కలిసి ఉండాలని, బలవంతంగా కాపురం చేయమని భార్యకు చెప్పలేం.. గుజరాత్ కోర్టు సంచలన తీర్పు..

క‌ర్నాట‌క‌లో కొత్తగా 707 కేసులు..
క‌ర్నాట‌క‌లో వ‌ర‌సుగా రెండో రోజు కోవిడ్ కేసులు పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో  707 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే ఈ కేసుల్లో బెంగ‌ళూరుకు చెందిన‌వే 565 కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కోవిడ్ నుంచి 104 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 0.61 శాతంగా ఉంది, మరణాల రేటు 0.42 శాతంగా న‌మోదైంది. కోవిడ్ పాజిటివ్ కేసుల‌
జాబితాలో బెంగళూరు సిటీ మొద‌టి స్థానంలో ఉంది. అందుకే సిటీలో ఆంక్ష‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. ఇదిలా ఉండగా గ‌డిచిన 24 గంటల్లో ఐదు ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ తెలిపారు. ఇందులో ఒక‌రు అమెరికా నుంచి, మ‌రొక‌రు ఖతార్ నుంచి, ఇంకొక‌రు దుబాయ్ నుంచి వ‌చ్చారు. మిగిలిన ఇద్ద‌రిలో ఒక‌రు దోహా నుంచి, ఇంకొక‌రు ముంబై నుంచి క‌ర్నాట‌క‌కు వ‌చ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios