అతి వృద్ధ పెద్ద పులి ‘ఎస్టీ -2’ ఇక లేదు..

రాజస్థాన్ లోని సరిస్కాలో నివసించిన అతి పురాతనమైన పులి ఎస్టీ - 2 మరణించింది. తోకలో ఇన్ఫెక్షన్ సోకడంతో చాలా కాలంగా అది చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో మంగళవారం అది మృత్యువాత పడింది. 

Oldest big tiger 'ST-2' is no more.. Death in Sariska Tiger Reserve, Alwar, Rajasthan..ISR

రాజస్థాన్ లోని అల్వార్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్ (ఎస్టీఆర్)లో ఉన్న అతి పెద్ద పులి ఎస్టీ-2 మరణించింది. దాని తోకకు గాయమై, ఇన్ఫెక్షన్ సోకడంతో సరిస్కా అభయారణ్యంలోని నయా పానీ ప్రాంతంలోని కరంకబాస్ ఎన్ క్లోజర్ లో వృద్ధ పులి చాలా కాలంగా చికిత్స పొందుతోంది.

అయితే ఎప్పుడూ చురుకుగా ఉండే ఎస్టీ-2 మంగళవారం మాత్రం నీరసంగా కనిపించింది. మధ్యాహ్నం వరకు ఒకే చోట కూర్చుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు పులిలో ఎలాంటి కదలిక కనిపించలేదు. అనుమానం వచ్చిన మానిటరింగ్ టీం, సిబ్బంది ప్రభుత్వ వాహనంతో ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించారు. పులిని పరిశీలించి, అది మృతి చెందినట్లు గుర్తించారు.

TS HighCourt: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట..

దీంతో పశువైద్యుల బృందం నేడు పులికి పోస్టుమార్టం నిర్వహించనుంది. ఎస్టీ-2 పులి వయసు 19 ఏళ్లని అక్కడి అధికారులు తెలిపారు. దానిని అక్కడి సంరక్షణ బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చేది. ఎస్టీ-2ను 2008 జూలై 4న రణథంబోర్ నుంచి సరిస్కా టైగర్ రిజర్వ్ కు తరలించారు.

తెలంగాణ బ్రదర్స్ ఆండ్ సిస్టర్స్ ... తస్మాత్ జాగ్రత్త..! : కేటీఆర్ హెచ్చరిక

ఈ ప్రాంతంలో అదే మొదటి పెద్ద పులి కావడం గమనార్హం. దానిని రణతంబోర్ నుండి అల్వార్‌లోని సరిస్కాకు తీసుకువచ్చారు. ఆ తర్వాతే సరిస్కాలో పులుల గర్జన మళ్లీ ప్రతిధ్వనించింది. అంతకు ముందు ఆ ప్రాంతంలో పులులు లేవు. ఈ పులి తన జీవిత కాలంలో ఎస్టీ-7, ఎస్టీ-8, ఎస్టీ-13, ఎస్టీ-14 అనే పులులకు జన్మనిచ్చింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios