TS HighCourt: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట..
Ex Mla Shakeel: బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రగతి భవన్ రోడ్డు ప్రమాదం కేసులో సాహిల్‌ను అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం తెలిపింది.
Ex Mla Shakeel: బీఆర్ఎస్ (Brs) మాజీ ఎమ్మెల్యే షకీల్ (Ex Mla Shakeel) కుమారుడు సాహిల్ కు ఊరట లభించింది. ప్రగతి భవన్ రోడ్డు ప్రమాదం కేసులో సాహిల్ ను అరెస్టు చేయవద్దని, ఈ మేరకు పంజాగుట్ట పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న పంజాగుట్ట పోలీసుల ముందు లొంగిపోవాలని సూచించింది.అలాగే.. కారు ప్రమాద ఘటనకు సంబంధించి కేసు డైరీని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సాహిల్ పేరును తొలగించాలని, అతని తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు.
పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) నిర్లక్ష్యంగా కారు నడిపినందుకే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. విచారణ సమయంలో.. సాహిల్ తప్పు చేయకపోతే దుబాయికి ఎందుకు పారిపోయాడని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అతని తరుఫు న్యాయవాది బదులిస్తూ.. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతోనే దుబాయ్ వెళ్లాడని న్యాయవాది కోర్టుకు వివరించారు. కావాలనే తన క్లైయిట్ సాహిల్ పేరును కుట్రపూరితంగా సాహిల్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతోనే...ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు. ఆసిఫ్ భయపెట్టి...సాహిల్ పేరు చెప్పించారని, అతనిపై 15 కేసులు ఉన్నట్లు చూపించారని కోర్టుకు తెలిపారు.
అసలేం జరిగింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ డిసెంబర్ 23 అర్ధరాత్రి ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. అతడు తన బీఎండబ్ల్యూ కారుతో బారికేడ్లను తొక్కుకుంటూ వెళ్లాడు. అయితే.. కేసు నుంచి తన కొడుకును తప్పించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నరనే ప్రచారం కూడా సాగుతోంది. సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు.