బెంగళూరు: ప్రభుత్వం గనుక ఆదుకోకపోతే వోడాఫోన్-ఐడియా కంపెనీని మూసేయాల్సి వస్తుందన్న కామెంట్ పై పార్లమెంటు సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఒక రకంగా ఇది ప్రభుత్వాన్ని బెదిరించడానికి చేస్తున్న చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇలా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే వారికోసం తన దగ్గర ఒక పరిష్కారం ఉందని అన్నాడు. వెంటనే ఎల్ఐసి వంటి ఒక రెండు మూడు సంస్థలు ముందుకు వచ్చి పెట్టుబడి పెట్టి ఈ కంపెనీని టేక్ ఓవర్ చేయాలనీ, ఆతరువాత దానిని ఒక సంవత్సరం తరువాత వేలం వేస్తే సరిపోతుందని, ప్రపంచంలో చాలా టెలికాం కంపెనీలు అప్పుడు కొనడానికి ముందుకొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇక ఇదే ట్వీట్ కి అనుబంధంగా మరో ట్వీట్ ని కూడా పోస్ట్ చేసారు. కొత్త దివాళా చట్టం కింద ప్రమోటర్లు కంపెనీలకి ఇక ఎంత మాత్రం బాసులుగా ఉండబోరని, వాటాదారులు ఎవరో ఒకరు ముందుకు వచ్చి కంపెనీని టేక్ ఓవర్ చేయవచ్చన్న విషయం ఈ పాత తరం వ్యాపారవేత్తలకు అర్థమవ్వడం లేదని  ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా జీవితాంతం ఆ కంపెనీ మీద వీరు అధికారాల్ని కలిగి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. 

కొన్ని రోజుల కింద రాహుల్ బజాజ్ చేసిన కామెంట్స్ పై కూడా రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. అప్పట్లో రాహుల్ బజాజ్ వంటివారు ప్రభుత్వంపై ఒత్తిడి తేలకపోతున్నందుకు మాధానపడిపోతున్నారని వ్యాఖ్యానించారు.