Asianet News TeluguAsianet News Telugu

‘నువ్వు మంత్రగత్తెవు.. ఇంటి నుంచి వెళ్ళిపో’... అంటూ ఆ మామ చేసి దారుణం...

‘నువ్వు  మంత్రగత్తెవు.. ఇంటి నుంచి వెళ్ళిపో’ అని ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసాడు. అయితే దానికి ఒప్పుకోకపోవడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. తాజాగా ఓ పిడుగులాంటి వార్త ఆమె చెవిన వేశాడు. 

old man harassing daughter-in-law in rajasthan
Author
Hyderabad, First Published Nov 5, 2021, 10:34 AM IST

రాజస్థాన్ : ఆమెకు సుమారు 50 ఏళ్లు. పెళ్లీడుకొచ్చిన కూతురు కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆమె భర్తను కోల్పోయింది. దీంతో అత్తవారి ఇంట్లోనే కన్నకూతుర్ని చదివించుకుంటూ కాలం వెల్లదీస్తోంది. ఈ గ్రామములో ఆమెకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. 

కోడలు, మనవరాలు అని కూడా చూడకుండా తన మామ తమ మీద దారుణానికి పాల్పడినట్లు తెలుసుకుని షాక్ అయింది. ఆ తర్వాత ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  ఇంతకు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలలోకి వెలితే.…

రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ మహిళ  కొన్నేళ్ళ క్రితం ఓ వ్యక్తిని పెళ్లాడింది.  వారికి ఓ అమ్మాయి కూడా జన్మించింది.  కూతురుకు  పెళ్లీడు వయసు వచ్చిన తర్వాత..  తాజాగా  husband కన్నుమూశాడు. దీంతో ఒంటరైన ఆమె..  కూతురును చూసుకుంటూ అత్తవారింట్లోనే ఉంటుంది.  భర్త దూరమైన విషయాన్ని ఇంకా జీర్ణించుకోకముందే మామ నుంచి ఆమెకు Harassment మొదలయ్యాయి.

‘నువ్వు  మంత్రగత్తెవు.. ఇంటి నుంచి వెళ్ళిపో’ అని ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసాడు. అయితే దానికి ఒప్పుకోకపోవడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. తాజాగా ఓ పిడుగులాంటి వార్త ఆమె చెవిన వేశాడు.  నువ్వు, నీ కూతురు స్నానం చేస్తుంటే  రహస్యంగా వీడియో తీశాను.  నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాటిని social mediaలో పెడతాను అంటూ ఆమెను బెదిరించాడు.  

దీంతో ఆమె తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరయింది చివరికి పోలీసులను ఆశ్రయించింది. అత్తవారింట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్తరాఖండ్‌లో మోడీ టూర్: కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

సగం యూనిఫాంతో ఎస్సై పరుగు.. ఎందుకంటే..

Karnatakaలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా Policeలు ఛేజ్ చేసి నిందితులను పట్టుకుంటారు. కానీ, కర్ణాటకలో అధికారులే ఓ నిందితుడిని Chase చేసి పట్టుకున్నారు. ఇంతకీ ఆ నిందితుడు ఎవరో కాదు.. ఓ పోలీసు అధికారే. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలో బుధవారం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక గుబ్బిన్ తాలూకాలోని పోలీసు స్టేషన్‌లో చంద్రేశఖర్ పొరా పోలీసు స్టేషన్‌లో సోమెశేఖర్ ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తుమకూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ పోలీసు స్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌లో ఇటీవలే ఓ ఫ్యామిలీ లిటిగేషన్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఓ వ్యక్తి చంద్రన్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ వాహనం ఇవ్వాలంటే రూ. 28వేలు లంచం ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌ను ఎస్ఐ సోమెశేఖర్ చెప్పారు.

రూ. 28వేల Bribe అడగ్గానే చంద్రన్న అదిరిపోయాడు. ఆయన యాంటీ కరప్షన్ బ్యూరో(ACB)ను ఆశ్రయించాడు. తన వాహనాన్ని విడుదల చేయాలంటే రూ. 28వేలు లంచం అడుగుతున్నారని తెలిపాడు. దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మీ ముందస్తుగా ఓ పథకం వేసింది.

చంద్రన్న రూ. 12వేలు కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌కు ఇచ్చాడు. విజయలక్ష్మీ నేతృత్వంలోని ఏసీబీ టీమ్ కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ను ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకుంది. 

ఆయనను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఈ విషయం తెలియగానే ఎస్ఐ సోమెశేఖర్ వెంటనే అలర్ట్ అయ్యారు. తన యూనిఫామ్ షర్ట్‌ను డస్ట్ బిన్‌లో పడేశాడు. పోలీసు స్టేషన్ నుంచి పరుగు లంకించుకున్నాడు.

ఏసీబీ అధికారులు ఇది గమనించారు. వెంటనే వారూ పరుగు అందుకున్నారు. ఎస్ఐ సోమెశేఖర్‌ను ఛేజ్ చేస్తూ వెంబడించారు. కనీసం ఒక కిలోమీటర్ ఆయన వెంటే పరుగు తీశారు. అప్పుడు సోమెశేఖర్‌ను పట్టుకోగలిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios