వివాహేతర సంబంధంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది. మల్కన్ గిరి జిల్లాలోని పొడియా సమితి, మెడిమెట్ల గ్రామంలో ఇర్మ కావసీ అనే యువకుడిని ఇదే గ్రామానికి చెందిన ఆడ్మ కావసీ అతడి తమ్ముడు ముక్క కావసీలు హత్య చేశారు.

భువనేశ్వర్: వివాహేతర సంబంధంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది. మల్కన్ గిరి జిల్లాలోని పొడియా సమితి, మెడిమెట్ల గ్రామంలో ఇర్మ కావసీ అనే యువకుడిని ఇదే గ్రామానికి చెందిన ఆడ్మ కావసీ అతడి తమ్ముడు ముక్క కావసీలు హత్య చేశారు.

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలం నుండి ఆడ్మ కావసీ భార్య, ఇర్మ కావసీల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకొన్న ఇర్మ కావసీ ఇందుకు కారణమని భావించారు. అడ్మ కావసీ తన తమ్ముడితో కలిసి ఇర్మ కావసీ ఇంటికి వెళ్లాడు. 

ఇంట్లో నిద్రపోతున్న ఇర్మ కావసీని అన్నదమ్ములు కత్తితో పొడిచి చంపారు. ఇర్మ కేకలు విన్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకోనేలోపుగానే నిందితులు పారిపోయారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.