Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జయంతి పట్నాయక్ కన్నుమూత

Jayanti Patnaik: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జాతీయ మహిళా కమిషన్‌ తొలి చైర్‌పర్సన్‌ జయంతి పట్నాయక్‌ బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 90 సంవ‌త్స‌రాలు. ఏప్రిల్ 7, 1932న గంజాం జిల్లాలోని అస్కాలో జన్మించారు. కటక్‌లోని శైలబాలా మహిళా అటానమస్ కళాశాల నుండి సామాజిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ముంబ‌యిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (TISS)లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

Odisha : Senior Congress leader Jayanthi Patnaik passes away
Author
First Published Sep 29, 2022, 4:49 AM IST

Veteran Congress leader Jayanti Patnaik: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జాతీయ మహిళా కమిషన్‌ తొలి చైర్‌పర్సన్‌ జయంతి పట్నాయక్‌ బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 90 సంవ‌త్స‌రాలు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జానకీ వ‌ల్లభ్ పట్నాయక్ భార్య, భారత పార్లమెంటేరియన్, ప్రముఖ సామాజిక కార్యకర్త జయంతి పట్నాయక్ బుధవారం భువనేశ్వర్‌లోని ఒక  ప్ర‌యివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (OPCC) మాజీ చీఫ్ నిరంజన్ పట్నాయక్ తెలిపారు. ఆమెకు 90 ఏళ్లు. ఆమె ఆరోగ్య క్షీణించ‌డంతో రాత్రి 8 గంటల సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది.

ఆమె భర్త, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అస్సాం మాజీ గవర్నర్ జేబీ పట్నాయక్ 2015లో మరణించారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1953లో జేబీ పట్నాయక్‌ను వివాహం చేసుకున్న జయంతి పట్నాయక్, కటక్, బెర్హంపూర్ రెండింటి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వృద్ధాప్య సంబంధిత అస్వస్థతతో బాధపడుతున్న జయంతి పట్నాయక్ సాయంత్రం అయినా స్పందించకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారనీ, ఆమె అంత్యక్రియలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె కుమారుడు తెలిపారు. జయంతి పట్నాయక్ ఏప్రిల్ 7, 1932న గంజాం జిల్లాలోని అస్కాలో జన్మించారు. కటక్‌లోని శైలబాలా మహిళా అటానమస్ కళాశాల నుండి సామాజిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ముంబ‌యిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (TISS)లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

జయంతి పట్నాయక్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. 

 

 

జయంతి పట్నాయక్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ గణేశి లాల్ సంతాపం తెలిపారు. "మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త, ప్రముఖ రచయిత్రి జయంతి పట్నాయక్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ సంతాపం వ్యక్తం చేశారు. సాహిత్య రంగానికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయం" అని రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె మృతి పట్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఓపీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్, మాజీ ఓపీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ స‌హా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

 


జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా నివాళులర్పించారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో జే పాండా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

 

 
అలాగే, మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ నాయకురాలు, సాహితీవేత్త జయంతి పట్నాయక్ మృతి పట్ల సీఎం నవీన్ పట్నాయక్, ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్, ఓపీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్, ఓపీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ లు సంతాపం వ్యక్తం చేశారు. "ఒడియా సాహిత్య రంగానికి, సమాజానికి ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని ప్రముఖ నాయకులు ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios