Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ, ఆప్ హోరాహోరీ..!

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది.

Delhi MCD Election Results 2022 Here is the Counting Update
Author
First Published Dec 7, 2022, 10:00 AM IST

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 250 వార్డులకు ఆదివారం రోజున పోలింగ్ జరిగింది. మొత్తం 1,349 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బుధవారం ఉదయం భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. రెండు పార్టీలు ఒక్కొక్కటి 100 స్థానాలకుపైగా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. మూడో స్థానానికి పరిమితమైన ఆ పార్టీ కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పూర్తి ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు వెలువడే అవకాశం ఉంది.

అయితే ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఢిల్లీలో ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. అయితే బీజేపీ కూడా తమ విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఎంసీడీ పీఠం తమదంటే తమదనే నమ్మకంతో ఉన్నాయి. 

ఎంసీడీ ఎన్నికలలో మొత్తం 250 సీట్లలో 180 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. విజయం సాధించేది తమేనని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆప్ ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ మారుతాయి. మేము 180 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాము. మేము మా కార్యాలయాన్ని అలంకరించాం. ట్రెండ్స్ మారిన వెంటనే మేము సంబరాలు చేసుకుంటాం’’ అని చెప్పారు. 

అయితే బీజేపీ నేతలు మాత్రం తాము గట్టి పోటీ  ఇస్తామని.. ఎగ్జిట్ పోల్స్ తప్పని నిరూపిస్తామని చెబుతున్నారు. ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. ‘‘మేము ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపిస్తాం. బీజేపీ వరుసగా నాలుగోసారి ఎంసీడీలో అధికారంలోకి వస్తుంది’’ అని చెప్పారు. 

ఇక, ఈసారి ఎంసీడీలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆప్ చూస్తుండగా.. బీజేపీ మాత్రం వరుసగా నాలుగోసారి కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తుంది. ఇక, 2017 ఎంసీడీ ఎన్నికల్లో 270 వార్డులకు గాను బీజేపీ 181 వార్డులు,  ఆప్ 48 వార్డులు, కాంగ్రెస్ 27  వార్డులు గెలుచుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios