కరోనా ఎఫెక్ట్: 180 మంది వెళ్లాల్సిన ఫ్లైట్‌లో నలుగురే, రూ. 10 లక్షల ఖర్చు

కరోనా వైరస్ భయంతో 180 మంది సీట్ల సామర్ధ్యం ఉన్న విమానంలో కేవలం నలుగురు మాత్రమే ప్రయాణించారు. భోపాల్ నుండి ఢిల్లీకి ప్రయాణించారు. ఇందు కోసం రూ. 10 లక్షలు ఖర్చు చేశారు.

Bhopal man hires 180-seater plane to ferry family members

భోపాల్: కరోనా వైరస్ భయంతో 180 మంది సీట్ల సామర్ధ్యం ఉన్న విమానంలో కేవలం నలుగురు మాత్రమే ప్రయాణించారు. భోపాల్ నుండి ఢిల్లీకి ప్రయాణించారు. ఇందు కోసం రూ. 10 లక్షలు ఖర్చు చేశారు.

లాక్‌డౌన్ ఆంక్షల మినహాయింపులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి విమానాల రాకపోకలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఓ వ్యాపారవేత్త ఇతర ప్రయాణీకులతో కలిసి విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడలేదు. అసలే కరోనా భయంతో ఆయన ప్రత్యేకంగా విమానాన్ని బుక్ చేసుకొన్నాడు. డబ్బులు ఖర్చు చేసినా ఫర్వాలేదు, సురక్షితంగా ప్రయాణం చేయాలనుకొన్నాడు.

ఏ-320 నెంబర్ గల విమానాన్ని బుక్ చేసుకొన్నాడు. భోపాల్ నుండి ఢిల్లీకి తన కుటుంబంతో ప్రయాణించాడు. వాస్తవానికి ఈ విమానంలో 180 మంది ప్రయాణం చేసే వీలుంది. కానీ, ఈ విమానంలో నలుగురు మాత్రమే ప్రయాణించారు. వ్యాపారవేత్త  తల్లి, ఇద్దరు పిల్లలు , ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి ఉన్నారు. 

also read:కరోనా ఎఫెక్ట్:పెళ్లైన గంటల్లోనే క్వారంటైన్‌కి వధూవరులు సహా 100 మంది బంధువులు

ఏ320 విమానం ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం 9.05 గంటలకు కేవలం పైలట్, క్యాబిన్ క్రూతో బయలుదేరి భోపాల్ చేరింది. అక్కడ నలుగురిని ఎక్కించుకుని ఉదయం 11.30 గంటలకు తిరిగి బయలుదేరి 12.55కి ఢిల్లీకి చేరుకుంది.

ఇలాంటి వారికి విమానయాన సంస్థలు, చార్టర్ విమానాలను ఆఫర్ చేస్తున్నాయి. విమాన ప్రయాణానికి అతిపెద్ద నిర్వహణ వ్యయం అయిన ఇంధన ధరలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నందున, తక్కువ ధరకే విమానాలను అద్దెకు ఇవ్వడానికి పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios