Asianet News TeluguAsianet News Telugu

తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుందని.. బతికున్న కూతురికి పిండం, దిన కర్మ.. 

ఒడిశాలోని కేంద్రపరాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా తన కూతురు వివాహం చేసుకుందని నిరసిస్తూ ఆమెను దహన సంస్కారాలు చేశారు.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Odisha parents perform last rites of daughter for marrying against their will KRJ
Author
First Published Sep 8, 2023, 2:15 AM IST

వారు తన కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఆమె భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటారు. బాగా చదివించి.. మంచి ఉద్యోగం చేస్తుందనుకున్నారు. అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా కలలు కన్నారు. తమ బిడ్డను బాగా చదివించి.. తమ స్థాయికి తగ్గ యువకుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. కానీ.. వారి కూతురు ఓ అబ్బాయిని ప్రేమించింది. అదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

కానీ ఆ తల్లిదండ్రులు నచ్చలేదు,  తమ స్థాయికి తగిన వ్యక్తి  వారించారు. అయినా.. ఆ కూతురు వినలేదు. తనకు నచ్చిన వాడితో వెళ్లిపోయి.. ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమను కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న కూతురు చనిపోయిన వారితో సమానం అని భావించింది. ఈక్రమంలోనే ఆ కుటుంబం ఆమె ఫోటోకు దండ వేసి కర్మకాండలు జరిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో  ఔల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేమల్ గ్రామానికి చెందిన మునా మల్లిక్ కుమార్తె దీపాంజలి మల్లిక్ (20) ఆగస్టు 28న తన ప్రియుడు రాజేంద్ర మల్లిక్ (23)ని ఓ దేవాలయంలో వివాహం చేసుకుంది. తమ కుమార్తె తమ నిర్ణయాన్ని ధిక్కరించడంపై ఆగ్రహించిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో ఆమెతో సంబంధాలను తెంచుకుని, ఆమె చనిపోయిందని ప్రకటించింది. అమ్మాయి తండ్రి మునా మల్లిక్  మాట్లాడుతూ.. "మా కూతురు రాజేంద్రతో కలిసి పారిపోయింది. మేము అతనిపై ఔల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ చేసాము.

పోలీసులు మా కుమార్తెను ఆరా తీసి అప్పగించారు. కానీ దీపాంజలి తిరుగుబాటు చేసి గ్రామంలోని గుడిలో రాజేంద్రను వివాహం చేసుకుంది. ఈ విషయం మమ్మల్ని తీవ్రంగా గాయపరిచింది. మా పరువు తీసింది. నా కూతురు మొత్తం కుటుంబానికి అవమానం తెచ్చింది. అందుకే నా కుమార్తె చనిపోయిందని బహిరంగంగా ప్రకటించి .. పిండ ప్రదానం కార్యక్రమం నిర్వహించాం.  తగిన యువకుడితో ఆమె వివాహాన్ని ఏర్పాటు చేయాలని మేము కలలు కన్నాము. కానీ, నా కూతురు మా సమ్మతి లేకుండా పెళ్లి చేసుకుంది" అని మల్లిక్ తన ఆవేదన వ్యక్తం చేశారు.  

నవ వధువు దీపాంజలి మాత్రం .. "నాకు వివాహ వయస్సు వచ్చింది. నేను సరైన నిర్ణయం తీసుకున్నాను’’ అని తెలిపింది. తమ ఇంటికి  కోడలు రావడంతో వరుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు. దీపాంజలిని మా కోడలిగా సంతోషంగా అంగీకరించాం" అని రాజేంద్ర తండ్రి అనంత్ మల్లిక్ అన్నారు. "వధూవరులిద్దరూ పెద్దవాళ్ళే. ఒక అమ్మాయి 18 ఏళ్లు నిండిన తర్వాత తన ఇష్టానుసారం పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. బాలిక కుటుంబ సభ్యులకు ఆమె అంత్యక్రియలు చేసే హక్కు లేదు. ఆమె మర్యాదలు చేయడం ద్వారా వారు ఆమె మానవ హక్కులను అవమానించారు , ఉల్లంఘించారు" అని కేంద్రపారా మానవ హక్కుల కార్యకర్త అమర్బరా బిస్వాల్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios