Asianet News TeluguAsianet News Telugu

Wedding kits: న‌వ దంప‌తుల‌కు ‘వెడ్డింగ్ కిట్స్’ .. కిట్ లో కండోమ్స్, గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు..

wedding kits: ఒడిశా ప్రభుత్వం కొత్తగా పెళ్లయిన జంటలకు వెడ్డింగ్ కిట్ ఇస్తుంది, ఈ కిట్ లో కండోమ్‌లతో సహా అనేక విషయాలుంటాయి. కుటుంబ నియంత్రణ గురించి యువ జంటలకు అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క లక్ష్యం.

Odisha govt to gift 'wedding kits' to raise awareness on family planning
Author
First Published Aug 14, 2022, 2:48 AM IST

Wedding kits: ఒడిశా ప్రభుత్వం ఓ కొత్త ప‌థకానికి శ్రీ‌కారం చూట్టింది. కొత్తగా పెళ్లైన జంటకు జనాభా నియంత్రణపై అవ‌గాహ‌న క‌ల్పించేలా ఓ ప‌థ‌కాన్ని రూపొందించ‌నున్న‌ది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద నయీ పహల్ ప్రాజెక్టులో భాగంగా వివాహ కిట్ (wedding kit)ను అందించనున్నారు. యువ జంటకు తాత్కాలిక లేదా శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించాల్సిన ప‌ద్ద‌తుల‌పై అవగాహన కల్పించడం ఈ ప‌థ‌క ప్ర‌ధాన లక్ష్యం.

ఈ మేర‌కు కొత్తగా పెళ్లైన జంటలకు పెళ్లి కిట్‌లు ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ wedding kit లో కండోమ్‌లతో పాటు కుటుంబ నియంత్రణకు సంబంధించిన అనేక ఇతర అంశాలు ఉంటాయి. సెప్టెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. వివాహ కిట్‌లో కుటుంబ నియంత్రణ పద్ధతులు,  దాని ప్రయోజనాలు, వివాహ నమోదు ధృవీకరణ పత్రం, కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రల గురించిన సమాచారంతో కూడిన పుస్తకం ఉంటుంది. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ కిట్, టవల్, దువ్వెన, నెయిల్ కట్టర్, మిర్రర్ కూడా ఉంటుంది. 

కుటుంబ నియంత్రణ శాశ్వత, తాత్కాలిక పద్ధతుల గురించి యువ జంటలకు అవగాహన కల్పించడం, వాటిని పాటించేలా వారికి అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం గురించి ఫ్యామిలీ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ బిజయ్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. ఇది నేషనల్ హెల్త్ మిషన్ (NHM) యొక్క 'నై పహల్ యోజన'లో ఒక భాగం. కొత్తగా పెళ్లయిన జంటల్లో కుటుంబ నియంత్రణ పాటించేలా అవగాహన కల్పించడం దీని లక్ష్యం. జిల్లా, బ్లాక్ స్థాయి నుంచి ఇది ప్రారంభం కానుందని.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి పథకం ప్రారంభమవుతుందని పాణిగ్రాహి తెలిపారు. దీని కోసం, ఆశా వర్కర్లకు శిక్షణ ఇస్తున్నారు, తద్వారా వారు దానిని సక్రమంగా దత్తత తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. .

ఇప్పటి వరకు అనేక‌ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టడానికి అనేక వాగ్దానాలు చేశాయి. కానీ, మొదటిసారిగా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా చేయ‌ని.. కొత్తగా పెళ్లయిన జంటలకు కిట్‌లను కండోమ్‌లు, ఇతర సామాగ్రి ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలకు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సైకిళ్లు మొదలైనవి ఇస్తామని వాగ్దానం చేస్తుంటాయి, అయితే ఈ పథకాన్ని ప్రారంభించిన దేశంలోనే తొలి రాష్ట్రం ఒడిశా.
 

Follow Us:
Download App:
  • android
  • ios