లాక్‌డౌన్ ఎఫెక్ట్: రెండు సార్లు వాయిదా, కలెక్టరేట్‌లో నిరాడంబరంగా పెళ్లి

లాక్‌డౌన్ నేపథ్యంలో కంప్యూటర్ టీచర్  కలెక్టర్ కార్యాలయంలో నిరాడంబరంగా పెళ్లిచేసుకొన్నాడు. ముందుగానే నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి కొడుకు తన రెండు మాసాల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు.

Odisha couple opts for simple wedding, donates money to CM relief fund

భువనేశ్వర్: లాక్‌డౌన్ నేపథ్యంలో కంప్యూటర్ టీచర్  కలెక్టర్ కార్యాలయంలో నిరాడంబరంగా పెళ్లిచేసుకొన్నాడు. ముందుగానే నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి కొడుకు తన రెండు మాసాల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు.

ఒడిశా రాష్ట్రంలోని మహిపూర్ గ్రామానికి చెందిన టుటు సాహు కంప్యూటర్ టీచర్ గా పనిచేస్తున్నాడు. నౌసాహి రాయ్ పాదకు చెందిన ట్వింకిల్‌లు గత ఏడాది డిసెంబర్ మాసంలో పెళ్లి చేసుకోవాలని  రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి.

అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో పెళ్లిని డిసెంబర్ మాసంలో నిర్వహించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ  తేదీకి వాయిదా వేశారు. అయితే ఫిబ్రవరి మాసంలో కూడ పెళ్లి జరగలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 1500 కి.మీ కాలినడకనే, స్వగ్రామానికి చేరుకొన్న గంటల్లోనే మృతి

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్ డౌన్  మే 3వ తేదీ వరకు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దఫాలు పెళ్లి వాయిదా పడింది. మరో వైపు నిర్ణీత ముహుర్తానికి పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నారు.

సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో  పెళ్లి చేసుకొన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా కొద్దిమంది బంధువులు, అధికారుల సమక్షంలో పెళ్లి చేసుకొన్నారు.వధువు టుటు తన రెండు మాసాల జీతం రూ. 12 వేలను ముఖ్యమంత్రి సహాయ నిధికి పెళ్లి చేసుకొన్న వెంటనే అధికారులకు అందించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios