లాక్‌డౌన్ ఎఫెక్ట్: 1500 కి.మీ కాలినడకనే, స్వగ్రామానికి చేరుకొన్న గంటల్లోనే మృతి

స్వగ్రామానికి చేరుకొన్న కొద్ది గంటల్లోనే  ఓ వ్యక్తి మరణించాడు. ఇంటికి చేరుకొనేందుకు ఆయన 1500 కి.మీ నడిచాడు. క్వారంటైన్ లో చేరుకొన్న కొద్దిసేపటికే ఆయన మృతి చెందిన విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

Mumbai Man walks 1,500 km from Vasai to UP's Shravasti, dies in quarantine


లక్నో: స్వగ్రామానికి చేరుకొన్న కొద్ది గంటల్లోనే  ఓ వ్యక్తి మరణించాడు. ఇంటికి చేరుకొనేందుకు ఆయన 1500 కి.మీ నడిచాడు. క్వారంటైన్ లో చేరుకొన్న కొద్దిసేపటికే ఆయన మృతి చెందిన విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇన్సాఫ్ అలీ  ముంబైలో వలస కూలీగా పనిచేస్తున్నాడు.లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన పనులు లేవు. దీంతో తన స్వగ్రామం వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నాడు. ఇన్సాఫ్ అలీది ఉత్త‌ర్ ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రవస్టి జిల్లా.ముంబైలోని వసయ్ నుండి ఉత్తర్ శ్రవస్టి జిల్లాకు కాలినడకన ఇన్సాఫ్ అలీ బయలుదేరాడు. 1500 కి.మీ పాటు ఆయన కాలినడకన వెళ్లాడు.

also read:నీతి అయోగ్ కార్యాలయ ఉద్యోగికి కరోనా: ఆఫీస్ మూసివేత

ఈ నెల 27వ తేదీన ఉదయం అలీ తన గ్రామానిక చేరుకొన్నాడు. గ్రామ సరిహద్దులోనే అధికారులు ఇన్సాఫ్ ను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారిని క్వారంటైన్ కు తరలించాలని తేల్చారు.

అలీని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మట్కన్వా లోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.క్వారంటైన్ కి తరలించిన కొద్దిసేపట్లోనే అలీ ఆయన మరణించాడు. డీ హైడ్రేషన్ కారణంగా అలీ మృతి చెందాడు..

క్వారంటైన్ కి తరలించిన తర్వాత అతడికి  బ్రేక్ ఫాస్ట్  ఇచ్చారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఐదు గంటలకు తన కడుపులో నొప్పి వస్తోందని చెప్పారన్నారు. అంతేకాదు మూడు దఫాలు వాంతులు చేసుకొన్నాడని చెప్పారు.

డాక్టర్ వచ్చేసరికి అతను కుప్పకూలిపోయాడని శ్రవస్టి జిల్లా ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ చెప్పారు. మృతుడి శాంపిల్స్ ను సేకరించి లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించినట్టుగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎ.పి. భార్గవ చెప్పారు.

శాంపిల్స్ రిపోర్టు వచ్చిన తర్వాతే అలీ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు.అలీకి ప్రాథమిక చికిత్స నిర్వహించిన సమయంలో కరోనా లక్షణాలు కన్పించలేదని  వైద్యులు చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios